Top
logo

వివో నుంచి బడ్జెట్ ఫోన్ .. అదిరిపోయే ఫీచర్స్

వివో నుంచి బడ్జెట్ ఫోన్ .. అదిరిపోయే ఫీచర్స్
X
Highlights

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం 10K ధరలో వివో తన అప్ కమింగ్ మోడల్ వై20 2021 స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి విడుదల చేసింది.

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం 10K ధరలో వివో తన అప్ కమింగ్ మోడల్ వై20 2021 స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ ఫోన్‌ను తొలుత మలేషియాలో లాంచ్ చేశారు. ఇందులో ఆక్టాకోర్ ప్రాసెసర్, బ్యాక్ 3 కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. ఇందులో అంచులు మందంగా ఉండనున్నాయి. రెండు కలర్ ఆప్షన్లు, ఒకే ఒక్క స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఇందులో అందించారు. వివో వై20 2021 ధర 599 మలేషియా రింగెట్లుగా( భారత దేశ కరెన్సీలో సుమారు రూ.10,900) నిర్ణయించారు. డామ్ వైట్, నెబ్యులా బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్ భారత్ లో ఎప్పుడు లాంచ్ చేసేది సంస్థ ప్రకటించలేదు.

వివో వై20 2021 స్పెసిఫికేషన్లు

6.51 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లేను

ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను

మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్ పెంచుకునే వెసులుబాటు

ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టం

బరువు 192 గ్రాములుగా ఉంది.

వెనకవైపు మూడు కెమెరాలు

ఫస్ట్ కెమెరా 13 మెగాపిక్సెల్ కాగా,

2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్,

2 మెగాపిక్సెల్ టెర్టియరీ సెన్సార్

ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

డ్యూయల్ బ్యాండ్ వైఫై,

బ్లూటూత్ 5.0,

జీపీఎస్, గ్లోనాస్, 4జీ,

మైక్రో యూఎస్‌బీ పోర్టు వంటి ఫీచర్లు

యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్,

ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను

బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్

Web Titlevivo y20 2021 launch News Smart Phone specification features
Next Story