విటమిన్‌-డి కావలంటే ..

విటమిన్‌-డి కావలంటే ..
x
Highlights

మనది ఎండలు ఎక్కువగా ఉండే దేశం. ఎండ అయినా కూడా చాలా మందిలో విటమిన్‌-డి లోపం అధికమైంది. జీవనవిధానంలో వచ్చిన విపరీతమైన మార్పులు దీనికి ముఖ్య కారణం....

మనది ఎండలు ఎక్కువగా ఉండే దేశం. ఎండ అయినా కూడా చాలా మందిలో విటమిన్‌-డి లోపం అధికమైంది. జీవనవిధానంలో వచ్చిన విపరీతమైన మార్పులు దీనికి ముఖ్య కారణం. పోద్దు పోయే వరకు నిద్రపోవడం. ఉదయాన్నే పార్కులకు వెళ్లి వ్యాయమం చేసే అలవాటు లేకపోవడం శరీరంలో విటమిన్‌-డి లోపం మరింత తీవ్రమవుతుంది.ఎండ తగలకుండా ఉండటం, ఎండలో ఉంటే శరీరానికి సన్‌స్ర్కీన్‌ లోషన్‌ రాసుకోవడం. విటమిన్‌-డి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వంటి కారణాలతో ఈ విటమిన్ శరీరంలోలోపిస్తుంది. విటమిన్‌-డి లోపం వల్ల శక్తి లోపించడం వల్ల కండరాల నొప్పి, జుట్టు రాలడం, ఎముకలు గుల్లబారడం ,మానసిక కుంగుబాటు వంటి సమస్యలు తలెత్తుతాయి.

45 నిమిషాల పాటు ఎండలో ఎక్స్‌పోజ్‌ చేస్తే మనకు కావాల్సినంత విటమిన్‌-డి లభించిస్తుంది. సూర్యకాంతి నుంచి శరీరం ఈ విటమిన్‌ను గ్రహించి నిల్వచేసుకుంటుంది.

వారంలో రెండుసార్లు చేపలు తీసుకుంటే మంచిది. వైట్‌ ఫ్యాటీ ఫిష్‌ తీసుకోవడం చాలా మంచిది.

గుడ్డు పసుపు సొనలో విటమిన్‌-డి ఎక్కువగా ఉంటుంది. కావున పసుపు సొనను కూడా చాలా తీసుకోవడం మంచిది.

విటమిన్‌-డి పుట్టగొడుగుల్లో సమృద్దిగా ఉంటుంది. వీటిని కొంత సమయం ఎండబెట్టి ఉంచడం విటమిన్‌-డి పెరుగుతుంది. పుట్టగొడుగులను ఇతర కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు.

డైలీ డైట్‌లో నట్స్‌, ఆయిల్‌ సీడ్స్‌ తీసుకోవాలి. వీటిలో విటమిన్‌-డి లభిస్తుంది.

ఉదయం తీసుకునే అల్పహారంలో విటమిన్‌-డి ఉన్న సెరెల్‌ బ్రేక్‌ఫాస్టులు, పాలు, పెరుగు, ఆయిల్స్‌ మార్కెట్లో ప్రత్యేకంగా లభిస్తున్నాయి. వాటిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories