Visa free: భారతీయుల కోసం స్వాగతం చెప్పే వీసా ఫ్రీ దేశాలు ఇవే.. ఈ వానాకాలం శెలవుల్లో ప్లాన్ చేయండి

Visa free monsoon countries
x

Visa free monsoon countries: భారతీయుల కోసం స్వాగతం చెప్పే వీసా ఫ్రీ దేశాలు ఇవే.. ఈ వానాకాలం శెలవుల్లో ప్లాన్ చేయండి

Highlights

Visa free monsoon countries: ఏ దేశానికైనా టూర్ ప్లాన్ చేయాలంటే వీసా అవసరం అని చాలామంది అనుకుంటు ఉంటారు. అయితే కొన్ని దేశాలు ఫ్రెండ్లీ దేశాలు మనకు వీసీ ఫ్రీ చేసాయి. కాబట్టి వీసా అవసరం లేకుండా మన భారతీయులు ఆయా దేశాలను విజిట్ చెయొచ్చు.

Visa free monsoon countries: ఏ దేశానికైనా టూర్ ప్లాన్ చేయాలంటే వీసా అవసరం అని చాలామంది అనుకుంటు ఉంటారు. అయితే కొన్ని దేశాలు ఫ్రెండ్లీ దేశాలు మనకు వీసీ ఫ్రీ చేసాయి. కాబట్టి వీసా అవసరం లేకుండా మన భారతీయులు ఆయా దేశాలను విజిట్ చెయొచ్చు. ముఖ్యంగా ఈ మాన్సూన్‌లో ఆయా దేశాలు మంచి మంచి ఆఫర్లు పెడుతున్నాయి. కాబట్టి.. ఈ వర్షాకాలంలో వచ్చే శెలవులకు అక్కడకు హాయిగా వెళ్లి తిరిగి రావచ్చు. ఇంతకీ ఈ వీసా ఫ్రీ దేశాలు ఏంటో తెలుసుకుందాం..

వానలు బాగా పడడంతో వాతావరణం బాగా చల్లగా మారింది. రొమాంటిక్ ఫీల్‌ని కలిగిస్తుంది. ఆగష్టు నెలలో వరసగా నాలుగైదు రోజులు శెలవులు కూడా వచ్చాయి. మరింకేం మీ పార్టనర్‌‌తో గానీ, ఫ్యామిలీతోగానీ ఎంచెక్కా ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేయండి. అయితే వీసా ప్రాబ్లమ్ అని మీరు అవ్వకండి. కొన్ని దేశాలు వీసా ఫ్రీ ఫెసిలిటీని మనకు కల్పిస్తున్నాయి. మరి ఆ దేశాలేంటో ఇప్పుడు చూద్దాం.

భూటాన్

భూటాన్. ఇదొక అందమైన దేశం. ఇక్కడ పచ్చని లోయలు, మఠాలు మరియు ఉత్సాహభరితమైన బౌద్ధ సంస్కృతి మనకు కనిపిస్తుంది. వర్షాకాలంలో వెళ్లాల్సిన ప్రాంతం ఇది. ఎందుకంటే పారో, థింఫు మరియు పునాఖా వంటి ప్రాంతాల్లో వర్షాకాలంలో ఎంతో అందంగా మనకు కనిపిస్తాయి. వాటి అందాలను చూడాలంటే వర్షాకాలంలోనే వెళ్లాలి. సంస్కృతి, నేచర్‌‌ని ఇష్టపడేవాళ్లు భూటాన్‌కు ఒక నాలుగైదు రోజులు టూర్ ప్లాన్ చేసుకోవచ్చు.

నేపాల్

మనకు అత్యంత సన్నిహిత పొరుగు దేశాలలో ఒకటి. గొప్ప సాంస్కృతిక అనుభవాలు, ఖాట్మండు వంటి నగరాల సందడి మరియు మరపురాని హిమాలయ సాహసాల వైపు మొగ్గు చూపే వారికి ఇది బెస్ట్ కంట్రీ. ఖాట్మండులోని దర్బార్ స్క్వేర్ మరియు పోఖారాలోని ఫేవా సరస్సును చూడకుండా అసలు తిరిగి రాకూడదు. వర్షాకాలంలో ఇక్కడ ఎంతో బావుంటుంది. అయితే ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లు ఈ వర్షాలు ఎక్కువగా ఉంటే బంద్ చేస్తారు. అందుకే ముందే బుక్ చేసుకుని నేపాల్ టూర్ ప్లాన్ చేసుకోవాలి.

మాల్దీవులు

మాల్దీవులు. అందమైన దీవులు. ఇక్కడకు వెళ్లాలంటే తక్కువ ఖర్చు అవుతుంది. అయితే రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ ఇంటికి తిరిగి వస్తారు. వర్షాకాలంలో ఈ దేశం స్పెషల్ ఆఫర్లు ఇస్తూ అంతర్జాతీయ టూరిస్టులను ఆకట్టుకుంటోంది. లగ్జరీ రిసార్ట్‌లు, అందమైన ప్రకృతి మాల్దీవులకు సొంతం. అందుకే కచ్చితంగా ఈ దేశానికి వెళ్లి రావాలి. భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఉచిత వీసా-ఆన్-అరైవల్ యాక్సెస్‌ను అందిస్తాయి. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ మరియు హోటల్ బుకింగ్ రుజువు వంటివి అవసరం అవుతుంది.

మారిషస్

వర్షాకాలంలో మారిషస్ ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండిపోయి ఉంటుంది. తేలికపాటి ఉష్ణోగ్రతలు మరియు అప్పుడప్పుడు జల్లులతో అక్కడ వాతావరణం ఒకింత రొమాంటిక్ ఫీల్‌ని కలిగిస్తుంది. 5 లేదా 6 రోజుల టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. కచ్చితంగా ఫ్లిక్ ఎన్ ఫ్లాక్ బీచ్, బ్లాక్ రివర్ గోర్జెస్ నేషనల్ పార్క్ మరియు పోర్ట్ లూయిస్ వంటి ప్రదేశాలను చూడాలి.

మలేషియా

మలేషియా..ఆధునిక నగరాలు, వర్షారణ్యాలు మరియు బీచ్‌ల మిశ్రమం. దీనిని బహుముఖ రుతుపవనాల గమ్యస్థానంగా చేబుతారు. ఈ కాలంలో తూర్పు తీరంలో తక్కువ వర్షాలు కురుస్తాయి, కాబట్టి మీరు ఎండ రోజులలో అక్కడకు వెళ్లొచ్చు. మలేషియాలో ఉన్నప్పుడు పెనాంగ్ వీధిల్లో దొరికే ఆహారపదార్ధాలను మిస్ కావొద్దు సుమా.

థాయిలాండ్

థాయిలాండ్‌లోని ఫుకెట్, క్రాబీ నగరాలు ఎంతో అందంగా ఉంటాయి. వర్షాకాలంలో వీటి అందాలు మరింత రెట్టింపు అవుతాయి. అయితే రద్దీగా ఉండే సమయాల్లో కాకుండా నిదానంగా ప్రశాంతంగా థాయిలాండ్‌కు ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మీరు బాగా ఎంజాయ్ చేసి రాగలుగుతారు.

సీషెల్స్

సీషెల్స్ . అందమైన బీచ్‌లు, పగడపు దిబ్బలు మరియు దట్టమైన అడవులకు ప్రసిద్ది. వర్షాకాలంలో వెచ్చని వాతావరణాన్ని మరియు అప్పుడప్పుడు జల్లులను కురిపిస్తుంటుంది. ఈ ద్వీపాలు జంటలు మరియు ప్రకృతి ప్రేమికులను బాగా ఆకట్టుకుంటాయి. ఈ దృశ్యాలు మరపురానివి, మరియు ఇక్కడ రద్దీ కూడా తక్కువగా ఉంటుంది. సందర్శకులు ఇక్కడ ప్రదేశాలను చూడాలంటే ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories