Top
logo

పిల్లా లేదు.. పెళ్లీ లేదు.. 50 ఏళ్లుగా ఆ ఉర్లో మగవారికి పెళ్లిళ్లు కాలేదు..!

పిల్లా లేదు.. పెళ్లీ లేదు.. 50 ఏళ్లుగా ఆ ఉర్లో మగవారికి పెళ్లిళ్లు కాలేదు..!
X
Highlights

పిల్లా లేదు.. పెళ్లీ లేదు.. పిల్లనిచ్చి పెళ్లి చేసే మామ లేడు.. ఏక్ నిరంజన్.. ఆ ఊళ్లో వాళ్లు.. ఈ పాటే...

పిల్లా లేదు.. పెళ్లీ లేదు.. పిల్లనిచ్చి పెళ్లి చేసే మామ లేడు.. ఏక్ నిరంజన్.. ఆ ఊళ్లో వాళ్లు.. ఈ పాటే పాడుకోవాల్సి వస్తోంది. ఆ ఊరికి వెళితే 18 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయస్సు ఉన్న బ్రహ్మచారులే కనబడతారు. ఆడ తోడు లేక ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఆ గ్రామంలో పెళ్లీ భజెంత్రీలు మోగి 50 ఏళ్లు కావస్తోంది. బీహార్‌లోని బర్వాన్ కాలా అనే గ్రామంలోని పరిస్థితి ఇది.

3000 జనాభా కలిగిన ఈ గ్రామంలో 130 మంది పైనే బ్రహ్మచారులు ఉండటం విశేషం. ఆ ఊరిలో అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో అబ్బాయిలు పొరుగు గ్రామాల్లోని అమ్మాయిలను పెళ్లి చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ గ్రామానికి సరైన మౌళిక సదుపాయాలు లేకపోవడంతో.. పెళ్లి చేసుకోవాటినికి ఎవరూ ముందుకు రావటం లేదు. దీంతో ఆ గ్రామంలోని వారంతా బ్రహ్మచారుల్లా ఉండిపోతున్నారు. కైమూర్ పర్వత ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి కనీసం రహదారి కూడా లేదు. విద్యుత్ లేక ఆ గ్రామస్థులు ఇంకా చీకటి రోజుల్లోనే జీవిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో యువకులకు పెళ్లి కావడం లేదు.

ఇటీవలే ఓ వధువు ఆ ఊర్లో అడుగుపెట్టి.. 50 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. దీంతో ఇన్నాళ్లు చికట్లో నివసిస్తున్న ఆ గ్రామ ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక ఆమెను ఆహ్వానించేందుకు ఊరంతా కలిసి స్వయంగా రోడ్లు బాగుచేసుకోవటం విశేషం.

Next Story