వంటగదే ఓ వైద్యశాల..

వంటగదే ఓ వైద్యశాల..
x
Highlights

మన ఆరోగ్యం మనచేతుల్లోనే అని చెప్పడం తరచూ వింటూంటాం. అవును మన పరిసరాలలో దొరికే వస్తువులు, ఆకులు, పండ్లు,ఇలా ఎన్నో మన ఆరోగ్యానికి అనువుగా ఉంటాయి...

మన ఆరోగ్యం మనచేతుల్లోనే అని చెప్పడం తరచూ వింటూంటాం. అవును మన పరిసరాలలో దొరికే వస్తువులు, ఆకులు, పండ్లు,ఇలా ఎన్నో మన ఆరోగ్యానికి అనువుగా ఉంటాయి ..అందులో ముఖ్యంగా పోపుల పెట్టె ...వనితల ఖజానాయే కాదు కుటుంబ ఆరోగ్యనిధి అని కూడా గుర్తించాలి. చాలా ప్రథమ చికిత్సలే కాదు దీర్ఘకాలం ఇబ్బందిపెట్టే జబ్బులకు కూడా సమాధానం కిచన్లోనే దొరుకుతుంది. అంటే మన ఇళ్లే ఓ వైద్యశాల అన్నమాట. మరి మన పోపు పెట్టెలో ఉండే వివిధ రకాల దినుసులు మనకు ఎలాంటి చికిత్సను అందిస్తాయో ఓసారి చూద్దాం...

దాల్చిన చెక్క :

దాల్చిన చెక్కలో ప్రోటీన్లు, పీచు, ఐరన్, సోడియం, విటమిన్ సి ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీనిలోని ఔషధ విలువల వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం చూపుతూ, కొలెస్ట్రాల్, ట్రెగ్లీసెరైడ్ స్థాయిని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

అల్లం:

అజీర్ణ వ్యాధులకు అల్లం అద్భుతంగా పనిచేస్తుందిజ ఉదర సంబంధ వ్యాధులకు అల్లాన్ని మించిన ఔషధం లేదని ఆయుర్వేదం గట్టిగా చెబుతోంది. వికారం, వాంతులు, విరోచనాలకు చెక్ పెడుతుంది.

వెల్లుల్లి :

పచ్చివెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి. ఆక్సీకరణ నుంచి శరీరంలోని కొవ్వును నివారించే కార్పినోజెనిక్ మిశ్రమ పదార్థాలు ఏర్పడే యాంటీ ఆక్సిడెంట్ ఇందులో మెండుగా వున్నాయి.

కుంకుంపువ్వు:

ఇది చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం. దేశ విదేశాలలో ఆహార పదార్థాలలో రుచి, రంగు, సువాసనకోసం వాడే కుంకుమపువ్వులో క్యాన్సర్ నిరోధక గుణాలు వున్నాయి.

లవంగాలు :

లవంగాలలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు దంత రక్షణనిస్తాయి. నోటిని, శ్వాసను తాజాగా వుంచుతాయి. హృదయానికి ఆరోగ్యాన్నిస్తాయి.

జీలకర్ర :

జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. దీనిలోని క్యూమిక్ డీహైర్ అనే పరిమళం లాలాజల గ్రంధులను క్రీయాశీలం చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. శ్వాసక్రియ వ్యవస్థను ఎలాంటి అంటురోగాలు సోకకుండా ఆరోగ్యంగా వుంచుతుంది.

ఆవాలు :

ఆవాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి కావలసిన విటమిన్లు వీటిలో ఉన్నాయి. కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు తగ్గిస్తుంది. శ్వాస అవరోధాలను దూరం చేస్తుంది.

నల్ల మిరియాలు :

మిరియాలు జీర్ణక్రియకు తోడ్పడతాయి. ఆహారం తేలికగా జీర్ణం కావడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను విడుదల చేయమని ఉదరాన్ని ప్రేరేపిస్తాయి.

పచ్చి ఏలకులు :

ఊపిరితిత్తులలో కఫాన్ని కరిగించి, శ్లేష్మాన్ని తొలగించే శక్తి ఏలకులకు ఉంది. శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడే పిల్లలకు ఏలకులు వేసిన పాలను తాగించాలి. ఇవి జీర్ణక్రియ వ్యవస్థపై చక్కగా పనిచేస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories