Water Heater: ఇక ఇంటి బయట నుంచే హీటర్‌‌ని కంట్రోల్ చేయొచ్చు..ఆధునిక గృహాల కోసం వీ గార్డ్ కొత్త వాటర్ హీటర్లు

Water Heater
x

Water Heater: ఇక ఇంటి బయట నుంచే హీటర్‌‌ని కంట్రోల్ చేయొచ్చు..ఆధునిక గృహాల కోసం వీ గార్డ్ కొత్త వాటర్ హీటర్లు

Highlights

V-Guard Water Heater: వి గార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇప్పుడు సరికొత్త లక్సెక్యూబ్ వాటర్ హీటర్ సీరీస్‌ను విడుదల చేసింది. ఇందులో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మూడు మోడళ్లు ఉన్నాయి.

V-Guard Water Heater: వి గార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇప్పుడు సరికొత్త లక్సెక్యూబ్ వాటర్ హీటర్ సీరీస్‌ను విడుదల చేసింది. ఇందులో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మూడు మోడళ్లు ఉన్నాయి. వీటి గురించి ఇంకా వివరాలు తెలుసుకుందాం.

కన్జూమర్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ లో పలు సర్వీసులు అందించే వి గార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సరికొత్త ఆధునాతనమైన వాటర్ హీటర్లను తీసుకొచ్చింది. ఎలివేటెడ్, టెక్ ఫార్వడ్, యాప్ ద్వారా ఆపరేషన్.. ఇలాంటి ఎన్నో సదపాయాలతో ఈ హీటర్లు ఉన్నాయి. లక్సెక్యూబ్, లక్సె క్యూబ్ డీజీ, లక్సె క్యూబ్ స్మార్ట్‌ అనే మూడు మోడళ్లను వీగార్డ్ ఇప్పుడు మార్కెట్లోకి విడుదల చేసింది.

ఈ మధ్య ఆధునికమైన గృహాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. మరి దీనికి అనుగుణంగా ఉండాలంటే హీటర్లలో కూడా మార్పులు రావాలి. అందుకే ఇప్పుడు వీ గార్డ్ అత్యాధునికి హీటర్లను విడుదల చేసింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్‌కు అనుకూలమైన వి గార్డ్ ఇప్పుడు స్మార్ట్ యాప్ ద్వారా హీట్‌ను కంట్రోల్ చేయొచ్చు. అంతేకాదు వాటర్ హీటింగ్‌ కోసం వినియోగదారులు సమయాన్ని కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. దీంతోపాటు అలెక్సా, గూగుల్ హోమ్ ద్వారా వాయిస్ కమాండ్లకు కూడా ఇవి సపోర్ట్ చేస్తాయి. మరి ఇంకేంముంది.. ఫ్యాన్‌లు, తలుపులు వచ్చినట్లే ఇప్పుడు వాటర్ హీటర్‌‌ కూడా వచ్చేసింది కదా. తరచూ వీటిని ఆఫ్ చేయడం మరిచిపోయి బయటకు వెళ్లేవాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories