మహిళలు రాత్రి పూట ఇది రాసుకుంటే..

మహిళలు రాత్రి పూట ఇది రాసుకుంటే..
x
Highlights

మహిళలు వారి అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా శరీర ఆకృతిని, సహాజత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు...

మహిళలు వారి అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా శరీర ఆకృతిని, సహాజత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు తహతహాలాడుతుంటారు. చర్మ సౌందర్యానికి సంబందించి ఎన్నో రకాల వస్తువులు మార్కెట్లో లభిస్తుడటంతో వాటిని వాడి అనేక సమస్యల భారీన పడుతుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే మన చర్మాన్ని కాపాడుకోవడానికి ఎంతో జాగ్రత్త వహించాలి.

చర్మం యొక్క భద్రత కోసం రోజ్ వాటర్‌ని ఉపయోగిస్తే అనేక వ్యాధులు కాపడుకోవచ్చు. తర తరాలుగా, స్త్రీ యొక్క సౌందర్య సంరక్షణలో రోజ్ వాటర్ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోజ్ వాటర్‌ని మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కలుపుకుంటే మీ మృదువైన చర్మాన్ని, చర్మ వ్యాధులు నుంచి కాపడుకోవచ్చు. ముఖంలో ఉన్న మంటపుట్టించే చర్మం, దద్దుర్లు, ముడతలు, మొటిమలు, వీటన్నిటిపై పోరాడే తత్వం రోజ్ వాటర్ కలిగి ఉండడం వల్ల, వీటి యొక్క నివారణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

*రోజ్ వాటర్ మీ చర్మంలో ఉన్న రంద్రాలని శుబ్రం చేసి, చర్మంలోని జిడ్డుని తీసేస్తుంది.

* రోజ్ వాటర్ వాడటం వల్ల నల్ల మచ్చలు, మొటిమలను దూరం చేసి, ముఖం పై ఉన్న దుమ్ము, ధూళిని తొలగిస్తుంది.

* దీనిని మీరు మీ 'ఫేష్యల్' తర్వాత ఉపయోగిస్తే మీ చర్మంలోని ఓపెన్ రంధ్రాలను మూసివేసి, కణాలని ఆరొగ్యంగా ఉంచుతుంది.

* దద్దుర్లూ, ఎర్రబడిన చర్మానికి రోజ్ వాటర్ మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories