పల్లీలతో ఇన్నీ ప్రయోజనాలు ఉన్నాయా..!

పల్లీలతో ఇన్నీ ప్రయోజనాలు ఉన్నాయా..!
x
Highlights

పల్లీలు లేనిదే వంటలు వండడం అసాధ్యంగా చెబుతారు కొందరు మహిళలు. చాలమంది రోజు తినే ఆహార పదార్థాల్లో పల్లీలను తరచూ వినియోగిస్తుంటారు. కొంత మందికి అయితే...

పల్లీలు లేనిదే వంటలు వండడం అసాధ్యంగా చెబుతారు కొందరు మహిళలు. చాలమంది రోజు తినే ఆహార పదార్థాల్లో పల్లీలను తరచూ వినియోగిస్తుంటారు. కొంత మందికి అయితే బ్రేక్‌పాస్ట్‌ లో పల్లీల చట్నీ ఉండాల్సిందే. ఇక పల్లీలతో ర‌క ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేసుకుని ఆర‌గించేవారు ఉన్నారు.

అయితే పల్లీలు కేవ‌లం రుచికే కాదు, ఆరోగ్యాన్ని అందించ‌డంలోనూ అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి అంటున్నారు నిఫుణులు. ప‌ల్లీల‌ను నిత్యం గుప్పెడు మోతాదులో తింటుంటే గుండెకు సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. హార్ట్ ఎటాక్ వంటి సమస్యలకు పల్లీలు.. టానిక్‌లా పని చేస్తుందట. నిత్యం 30 గ్రాముల మోతాదులో ప‌ల్లీల‌ను తీసుకుంటే గుండె జబ్బులు రావని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

ప‌ల్లీల్లో మాంగ‌నీస్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా చేస్తాయట. అంతే కాదు శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని కూడా పెంచుతాయి. దీని వల్ల ఒత్తిడి తగ్గి.. మెద‌డు చురుగ్గా పనిచేస్తుంది. సో.. నిత్యం ప‌ల్లీల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే.. గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

=

Show Full Article
Print Article
More On
Next Story
More Stories