Top
logo

కోడి గుడ్లు ఎక్కువ తింటే ఇక అంతేనట..

కోడి గుడ్లు ఎక్కువ తింటే ఇక అంతేనట..
X
Highlights

ఏదైనా అవసరానికి మించి చేస్తే అనర్ధానికి దారి తీస్తుందని అందరికీ తెలిసిన విషయమే. సంపూర్ణ ఆరోగ్యానికి...

ఏదైనా అవసరానికి మించి చేస్తే అనర్ధానికి దారి తీస్తుందని అందరికీ తెలిసిన విషయమే. సంపూర్ణ ఆరోగ్యానికి కోడిగుడ్లు మంచివని మనం చాలాకాలంగా విన్నాం.. అలాగే వీటిని ఎక్కువగా తింటే గుండెకు చేటు అంటున్నారు మసాచూసెట్స్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. 30 వేల మందిని ఏకంగా 31 ఏళ్లపాటు పరిశీలించిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. అధ్యయన ఫలితాల తరువాత తాము ఈ అంచనాకు వచ్చినట్లు కేథరీన్‌ టకర్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. జుకర్‌బర్గ్‌ కాలేజ్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం రోజుకు తినే గుడ్ల సంఖ్య ఎంత పెరిగితే ముప్పు కూడా అంతే పెరుగుతుందని తేల్చారు.

అమెరికాకు చెందిన 30 వేల మంది అధ్యయనంలో పాల్గొన్నారని, వారి ఆహారపు నాణ్యత, వ్యాయామం చేసే అలవాట్లు వంటివన్నీ పరిశీలించామని చెప్పారు. అమెరికాలో గుడ్ల వినియోగం పెరుగుతున్న పమయంలో ఈ అధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడిందని కేథరీన్‌ తెలిపారు. 2017లో ఒక్కో అమెరికన్‌ దాదాపు 279 గుడ్లు తిన్నారని.. 2012లో 254 మాత్రమేనని వివరించారు. ప్రతి ఏటా గుడ్ల వినియోగం పెరుగుతుందని వారు తెలిపారు. ఒక్కో గుడ్డులో దాదాపు 200 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్‌ ఉంటుందని.. రోజుకు 300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కొలెస్ట్రాల్‌ తీసుకుంటే గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎక్కువ గుడ్లు తినేవారిలో 17-18 శాతం మందికి తొందరగా మరణం సంభవించే అవకాశం ఉంటుందని కేథరిన్‌ వివరిస్తున్నారు. కావున రోజుకు మూడు గుడ్లతో మించి తినడం అంత మంచిది కాదని చెప్పారు.

Next Story