రెండంతస్తుల ఊరు..

రెండంతస్తుల ఊరు..
x
Highlights

రెండంతస్తుల ఊరు.. ఇదేందీ.. ఎక్కడైన రెండంతస్తుల ఇల్లు ఉంటుంది కానీ .. ఊరు ఉంటుందా అని ఆలోచిస్తున్నారా.. మీరు చదువుతుంది నిజంగా నిజ్జం. రెండుంతస్తుల ఊరు...

రెండంతస్తుల ఊరు.. ఇదేందీ.. ఎక్కడైన రెండంతస్తుల ఇల్లు ఉంటుంది కానీ .. ఊరు ఉంటుందా అని ఆలోచిస్తున్నారా.. మీరు చదువుతుంది నిజంగా నిజ్జం. రెండుంతస్తుల ఊరు నిజంగా ఉంది. బ్రెజిల్‌ వెళితే ఈ వింత ఊరుని చూడవచ్చు. అక్కడ ఉండే లాసెర్డా ఎలివేటర్‌ భలే విచిత్రంగా ఉంటుంది. ఇది రెండంతస్తుల ఓ ఊరుకు వారధిగా ఉంటుంది. ఇక్కడి సాల్వడార్‌ అనే టౌన్ సిదాజ్‌ బైక్సా, సిదాజ్‌ అల్టా అనే రెండు సిటీలుగా విడిపోయి ఉంటుంది.

సముద్ర తీరంలో ఉన్న కింద సిటీ నుంచి పై సిటీ 279 అడుగుల ఎత్తులో ఉంటుంది. మరి పైన నుంచి కిందకు, కింద నుంచి పైకి వెళ్లాలని.. లిఫ్టు కట్టారు. అదే లాసెర్డా ఎలివేటర్‌. మరో విశేషం ఎంటంటే బ్రెజిల్‌లో మొట్టమొదటి ఎలివేటర్‌ ఇదే. దీన్ని ఎప్పుడో 1873లో నిర్మించారు. ఆ తర్వాత మార్పులు చేస్తూ హంగులు అద్దుతూ వచ్చారు. సుమారు 20 అంతస్తుల ఎత్తు ఉండే ఈ ఎలివేటర్‌ 30 సెకన్లలో దూసుకుపోవటం మరో విశేషం. రోజూ ఈ లిఫ్టులో 15 వేల మంది వరకు ఎక్కుతుంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories