టీవీ చూస్తూ తింటున్నారా..? అయితే..

టీవీ చూస్తూ తింటున్నారా..? అయితే..
x
Highlights

కంటి నిండా నిద్ర..టైంకు తిండి.. మానసిక ప్రశాంతత.. ముఖ్యంగా మనం అర్యోగంగా ఉండాలంటే ఇవి తప్పక పాటించాలి. అయితే వీటిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు...

కంటి నిండా నిద్ర..టైంకు తిండి.. మానసిక ప్రశాంతత.. ముఖ్యంగా మనం అర్యోగంగా ఉండాలంటే ఇవి తప్పక పాటించాలి. అయితే వీటిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కొందరు. ముఖ్యంగా ఆహారం తీసుకునేటప్పుడు సరైన పద్దతులు పాటించకుండా తూ..తూ మంత్రంగా కానిచేస్తాం. తినేటప్పుడు ఏకాగ్రతగా ధ్యాస మొత్తం తిండి మీదనే పెట్టి తినాలంటున్నారు నిపుణులు. చాలామంది టీవీ చూస్తూనో, మొబైల్ చూస్తూనో తింటుంటారు.

అలా చేయడం వల్ల ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. తినేటప్పుడు టీవీ చూడడం అనేవి రెండూ వేరువేరు పనులు. రెండూ ఒకేసారి చేయడం వల్ల మెదడు ఎక్కువ ఒత్తిడికి గురవుతుంది. ఆ ప్రభావం ఆరోగ్యం మీద ఉంటుందట. అందుకే బ్యాలెన్సింగ్ తిండి తినడంతో పాటు సరైన పద్ధతిలో తినాలంటున్నారు. ఆహారాన్ని బట్టి శరీరానికి పని చెప్పడం, విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యమే అంటున్నారు. టీవీ చూస్తూ ఆహారం తినడం వల్ల గుండెజబ్బులు, డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు. టీవీ చూస్తూ స్నాక్స్ తినేవారు, ఇతర ఆహార పదార్థాలు తినేవారిలో మెటబాలిక్ సిండ్రోమ్ ఉందని బ్రెజిల్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తేలింది.

అలాగే మనం తీసుకునే ఆహారంపై కూడా శ్రద్ద వహిచండం చాలా ముఖ్యం. మనం రోజూ తీసుకొనే ఆహార పదార్థాలలో చిరు ధాన్యాలు ఉంటే మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకొన్న వారమవుతాము. అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ డబ్బులు పోగొట్టుకునే బదులు సరైనా తిండి తినడం మంచిది. మన చిరుధాన్యాలు కూడా ఉండడం చాలా ముఖ్యం. అవి అతి తక్కువ అలర్జీ కలిగించి జీర్ణశక్తిని పెంచుతాయి. వీటిలో ఉన్న పీచు, కొలెస్ట్రాల్‌ను, ట్రైగ్లిగురైడ్స్‌లను తగిస్తుంది నరాల వ్యవస్థకు దోహదపడే లెసితిన్‌ అధిక పరిమాణంలో ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories