Blackheads: ముఖంపై బ్లాక్‌ హెడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. వీటిని ట్రై చేయండి..!

Troubled with Blackheads on The Face Try These Tips
x

Blackheads: ముఖంపై బ్లాక్‌ హెడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. వీటిని ట్రై చేయండి..!

Highlights

Blackheads: ముఖంపై బ్లాక్‌ హెడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. వీటిని ట్రై చేయండి..!

Blackheads: వేసవికాలం వచ్చేసింది. ఎండలు పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో చర్మాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ముఖానికి ఎండదెబ్బ తగలకుండా చూసుకోవాలి. అలాగే ఈ రోజుల్లో ముఖంపై బ్లాక్‌హెడ్స్ సర్వసాధారణంగా మారాయి. చాలా మంది బ్లాక్ హెడ్స్‌ని పోగొట్టుకోవడానికి ఫేస్ స్క్రబ్, బ్లాక్ హెడ్స్ రిమూవల్ ఫేస్ వాష్, క్రీమ్ వంటి అనేక రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కొన్నిసార్లు ఈ ఉత్పత్తులు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అందుకే ఇంట్లో దొరికే సహజసిద్దమైన పదార్థాలను వాడితే చాలా మంచిది. ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. వాటి గురించి తెలుసుకుందాం.

1. రాతి ఉప్పు, తేనె ప్యాక్

* ఒక గిన్నె తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేయండి.

* దానికి 1 టీస్పూన్ తేనె కలపండి.

* రెండింటినీ బాగా మిక్స్‌ చేయండి.

* దీన్ని ముఖమంతా బాగా పట్టించండి.

* అప్లై చేసిన 5 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగండి.

2. పసుపు ప్యాక్

* ఒక గిన్నె తీసుకుని అందులో 1 టీస్పూన్ పసుపు వేయండి.

* దానికి 3-4 స్పూన్ల నీరు కలపండి.

* దీన్ని బాగా పేస్ట్‌లా కలపండి.

* దీన్ని ముఖమంతా బాగా పట్టించండి.

* 20 నిమిషాల పాటు చేతులతో ముఖాన్ని మసాజ్ చేయండి.

* తర్వాత చల్లని నీటితో ముఖం కడగండి.

3. తేనె, నిమ్మకాయ ప్యాక్

* ఒక గిన్నె తీసుకుని అందులో 1 చెంచా తేనె వేయండి.

* 1 నిమ్మకాయ రసం కలపండి.

* రెండింటిని మిక్స్‌ చేసి పేస్ట్‌లా చేయండి.

* బ్లాక్ హెడ్స్ ఉన్న చోట ఈ పేస్ట్‌ని అప్లై చేయండి.

* సుమారు 20 నిమిషాలు ఆరనివ్వండి.

* ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగండి.

Show Full Article
Print Article
Next Story
More Stories