Watermelon Seeds: పుచ్చకాయలో కాదు వాటి గింజల్లో ఉంటే ఈ 5 ప్రయోజనాలు ముందుగా తెలుసుకోండి..

Watermelon Seeds: పుచ్చకాయలో కాదు వాటి గింజల్లో ఉంటే ఈ 5 ప్రయోజనాలు ముందుగా తెలుసుకోండి..
x
Highlights

Watermelon Seeds Benefits: పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్‌ కూడా ఉంటాయి. పుచ్చకాయ ఎండాకాలం ఎక్కువగా విక్రయిస్తారు. ఇది మన శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అయితే, పుచ్చకాయ గింజల్లో ఉండే ప్రయోజనాలు తెలుసుకుందాం.

Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజల్లో జింక్‌, పొటాషియం వంటి మైక్రోన్యూట్రియేంట్స్‌ ఉంటాయి. ఈ గింజలు రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతాయి. రెగ్యులర్‌ డైట్‌లో పుచ్చకాయ గింజలు చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యంతోపాటు ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది.

ఆరోగ్యకరమైన కొవ్వులు..

పుచ్చకాయ గింజల్లో మోన్‌అన్‌శాచురేటెడ్‌, పాలీఅన్‌శాచురేటెడ్‌ కొవ్వు యాసిడ్స్‌ ఉంటాయి. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గించేస్తాయి. అంతేకాదు ఈ గింజలు తింటే స్ట్రోక్‌, హార్ట్‌ అటాక్‌ సమస్యలు కూడా తగ్గిపోతాయి. శరీర ఆరోగ్యానికి ఇవి తోడ్పడుతాయి.

ఇమ్యూనిటీ..

పుచ్చకాయ గింజల్లో జింక్‌ ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. అంతేకాదు ఇవి ఇమ్యూన్‌ సెల్స్‌ను ఉత్పత్తి చేయడం, యాక్టివేట్‌ చేయడం కూడా చేస్తుంది. ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతే సీజనల్ జబ్బులు రాకుండా ఉంటాయి. దీంతో మీరు రోగాల బారిన పడకుండా ఉంటారు.

షుగర నియంత్రణ..

పుచ్చకాయ గింజలు ఇన్సూలిన్‌ సెన్సిటివిటీని పెంచుతాయి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. పుచ్చకాయ గింజల్లో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్స్‌ను నియంత్రించి మెటబాలిజం రేటును పెంచుతాయి. దీంతో షుగర్‌ కూడా నియంత్రణలో ఉంటాయి.

జీర్ణ ఆరోగ్యం..

పుచ్చకాయ గింజల్లో ఫైబర్‌, అన్‌శాచురేటడ్‌ కొవ్వులు ఉంటాయి. ఇవి జీర్ణ ఆరోగ్యానికి మేటు చేస్తాయి. అంతేకాదు ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతాయి. పుచ్చకాయ గింజలు రెగ్యులర్‌గా తీసుకుంటే జీర్ణక్రియను కూడా మెరుగు చేస్తుంది.

జుట్టు ఆరోగ్యం..

పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్‌ ఐరన్‌, మెగ్నీషియం, జింక్‌, కాపర్‌ ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. ఈ గింజలు జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరగటానికి తోడ్పడతాయి. ఈ గింజలలో ఉండే మ్యాంగనీస్‌ జుట్టుకు ఒక షీల్డ్‌లా పనిచేస్తుంది. డ్యామేజ్‌ కాకుండా, స్ల్పిట్‌ ఎండ్‌ సమస్య రాకుండా కాపాడుతుంది.

ఎముక ఆరోగ్యం..

ఈ గింజల్లో క్యాల్షియం ఉంటుంది. ఇవి ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఎముక ఆరోగ్యానికి ఈ పుచ్చకాయ గింజలు సహాయపడతాయి. ఇది ఆరోగ్యకరమైన కండరాలకు తోడ్పడతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories