Top 10 Websites World : టాప్-10లో 'ఆ' వెబ్ సైట్ కూడా ఉంది

Top 10 Websites World : టాప్-10లో ఆ వెబ్ సైట్ కూడా ఉంది
x
నెట్లో పరిశోధన ప్రతీకాత్మక చిత్రం
Highlights

ప్రపంచం మొత్తం సాంకేతిక పరిజ్ఞానం కొంతపుంతలు తొక్కుతుంది. ఇంటర్నెట్ యుగం మొదలైంది ఇంటర్నెట్ ప్రపంచంలో ఎన్నో మార్పలు వచ్చాయి.

ప్రపంచం మొత్తం సాంకేతిక పరిజ్ఞానం కొంతపుంతలు తొక్కుతుంది. ఇంటర్నెట్ యుగం మొదలైంది ఇంటర్నెట్ ప్రపంచంలో ఎన్నో మార్పలు వచ్చాయి. ఎవరి చేతిలో చూసిన స్మార్ట్‌ఫోన్ వాడకం తప్పనిసరైంది. కంప్యూటర్, ల్యాప్‌టాప్, టాబ్లెట్, ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటికి నెటిజన్లు తరచువాడుతున్నారు. అయితే అంతర్జాల రంగంలో కూడా పలు విప్లవాత్మక మార్పులు మొదలైయ్యాయి. టాప్-10లో నిలిచిన కొన్ని వెబ్‌పైట్లను సిమిలర్ వెబ్‌హైలెట్స్ అనే సంస్థ ప్రకటించింది. ఏ వెబ్ సైట్ ఎంతమంది చూస్తు్న్నారో చెప్పేసింది. 167.5 బిలియన్ సార్లు నెటిజన్లు 10 వెబ్ సైట్లను ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. గత ఏడాది నెటిజన్లు ఎక్కువగా చూసిన వెబ్ సైట్లపై ఎంటో చూద్దాం..

గూగుల్ ఇది టాప్ వన్ లో నిలిచింది. ప్రతి ఒక్కరు దీనిని ఓపెన్ చేస్తు్న్నారు. సిమిలర్ వెబ్‌హైలెట్స్ వెల్లడించిన జాబితాలో గూగుల్ మొదటి స్థానంలో ఉంది.ఏం సెర్చ్ చేయాలన్నా గూగుల్ కి వెళ్తాము.


యూట్యూబ్ గూగుల్ తర్వాత స్థానంలో ఉంది. వీడియోలు చూడాలన్న యూట్యూబ్ చూడక తప్పదు. ఎంతో మంది తమ చానల్స్ కూడా పెడుతున్నారు. అయితే రెండోస్థానంలో యూట్యూబ్ గూగుల్ పేరెంటల్ సంస్థకే చెందింది.


ఫేస్‌బుక్ అనేది ఒక సోషల్ నెట్వర్క్ సర్వీస్ ఆరంభించిన ఈ వెబ్‌సైట్ వ్యక్తిగత యాజమాన్యాన్ని కార్యకలాపాలను ఫేస్‌బుక్, ఇంక్. నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీనికి 200 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఫిబ్రవరి 2004లో దీనినీ ప్రవేశపెట్టారు.


ఇక నాలుగోది చైనాకు చెందిన బైదు. చైనాకు చెందిన సెర్చింజన్, గూగుల్ ఏలా ఉపయోగిస్తారో ఇది కూడా అంతే. బైదు నాలుగో స్థానంలో ఉన్నట్లు సిమిలర్ వెబ్‌హైలెట్స్ తెలిపింది.



ఏదైనా సమాచారం కావాలంటే వికీపీడియాలోనే తెలుసుకుంటాం.. అందుకే వికీపిడియాకు ఐదో స్థానంలో ఉంది. వ్యక్తుల గురించి, లేద ఏదైనా పూర్తిస్థాయిలో వివరాలు కావాలంటే ఆశ్రయించేది వికీపీడియానే.



ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా ఆరో స్థానంలో ఉండడం విశేషం. సినిమాలకు, వస్తువులు కొనుగోలుకు దీనిని ఉపయోగిస్తాం.



ఇక తర్వాతి 7,8,9, 10 స్థానాల్లో ట్వీటర్, ఇన్ స్టాగ్రాం, యాహూ, ఎక్స్ వీడియోస్ ఉన్నాయి. ఏడో స్థానంలో ట్వీటర్ ఉంది. ఏనిమిదో స్థానంలో ఇన్ స్టాగ్రాం, తొమ్మిదో స్థానంలో యాహూ ఉంటే పదోస్థానంలో పోర్న్ వెబ్ సైట్ ఎక్స్ వీడియోస్ నిలిచింది. పోర్న్ ప్రియులందరూ విపరీతంగా ఈ వెబ్‌సైట్ కూడా ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories