పిల్లలకు బడి కాదు.. బయటి సమాజం కూడా ముఖ్యమే...

పిల్లలకు బడి కాదు.. బయటి సమాజం కూడా ముఖ్యమే...
x
Highlights

నేటి బాలలు రేపటి పౌవురులు.. బాలల భవిష్యత్ చిన్నతనంలోనే గట్టి పునాది వెసుకున్నప్పుడే నవ నిర్మాణ భారత్ సాద్యం అవుతుంది. పిల్లల్లో చిన్నతనం నుంచి...

నేటి బాలలు రేపటి పౌవురులు.. బాలల భవిష్యత్ చిన్నతనంలోనే గట్టి పునాది వెసుకున్నప్పుడే నవ నిర్మాణ భారత్ సాద్యం అవుతుంది. పిల్లల్లో చిన్నతనం నుంచి విజ్ఞానం పెంపోదించాలి. బడి నుంచి కాదు బయటి సమాజం కూడా వారు నెర్చుకునే అంశాలు ఎన్నో ఉంటాయి. వాటిని పిల్లలు అవగాహన చేసుకోనేలా తల్లిదండ్రులు చేయాల్సిన పని.. చదువు పాటు వారికి జ్ఞానాన్ని సంపాందుకునేలా ఎలాంటి ఎలా ప్రోత్సాహించాలో ఓ సారి చూద్దాం...

పిల్లల్ని గ్రంథాలయాలకు పంపి అక్కడ కూర్చుని కాసేపు చదువుకునేలా చూడండి. పిల్లలకు సంబంధించిన గ్రంథాలయాలూ కూడా అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి సభ్యత్వం తీసుకోండి.

అప్పుడప్పుడు.. పిల్లలతో కలిసి తరచూ కొత్త ప్రదేశాలు ప్రయాణించండి. దానివల్ల ప్రపంచం, కొత్త పరిసరాల గురించి తెలియని విషయాలు నేర్చుకుంటారు. ఆ ప్రాంతాలకు సంబంధించిన చరిత్రా, అక్కడ ప్రత్యేకత ,సంప్రదాయాలు, పద్ధతుల గురించి వివరించండి.

దగ్గర్లోఉండే జంతు ప్రదర్శనశాలకీ... చారిత్రక ప్రదేశాలూ, విభిన్న సంస్కృతులకు కార్యక్రమాలకు, పిల్లల్ని తీసుకెళ్లాలి. వీటి ద్వారా వారు ఎన్నో విషయాలను నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల వారి ఆసక్తులూ, అభిరుచుల్ని తెలుసుకునే ప్రయత్నమూ చేయొచ్చు.

పిల్లల్లో సందేహాలు కలిగించే అంశాలు ఎన్నో ఉంటాయి. వాటికి ఓర్పుగా సమాధానం చెప్పాలి. అలాగే వాళ్ల వయసును బట్టి టేక్నాలజీపై అవగాహన కలిపించాలి దానివల్ల వారికి స్వతహగా సమాచారాన్ని సేకరించుకుంటారు. వాళ్ల సందేహాలూ తీరుతాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories