ఇలా చేస్తే ఆ అలవాటును మానొచ్చు..

ఇలా చేస్తే ఆ అలవాటును మానొచ్చు..
x
Highlights

చాలా మందికి గోళ్లు కొరకడం అలవాటు దాన్ని మానాలి అనుకున్నా మానలేకపోతుంటారు. కొందరు ఆఫీస్‌లో,టీవీ చూస్తున్నా అసంకల్పితంగా గోళ్లు కొరుకుతుంటారు. ఎదుటి...

చాలా మందికి గోళ్లు కొరకడం అలవాటు దాన్ని మానాలి అనుకున్నా మానలేకపోతుంటారు. కొందరు ఆఫీస్‌లో,టీవీ చూస్తున్నా అసంకల్పితంగా గోళ్లు కొరుకుతుంటారు.

ఎదుటి వ్యక్తులు చెబుతున్నప్పుడు కాసేపు కొరకడం ఆపేసి తర్వాత షరా మామూలే. ఏదైనా 'టెన్షన్‌'లో ఉన్నప్పుడు టకటక గోళ్లు కొరికేస్తుంటారు. దీన్నే 'ఒనైకో ఫేజియా' అంటారు. ఇలా చేయడం వల్ల గోళ్లకు, దంతాలకు నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు గోళ్లనే కాదు వేళ్ల చివర్లలో ఉండే చర్మాన్ని కూడా తింటుంటారు పరిశుభ్రంగా లేని వేళ్ళను నోటిలో పెట్టుకుని కొరకడం ద్వారారోగాల బారిన పడే అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ అలవాటును కొన్ని సింపుల్ టిప్స్ సాటించడం ద్వారా మానేయొచ్చు.

* గోర్లలలో ఉండే సూక్ష్మక్రిములు తేలికగా నోట్లోకి వెళ్లి సమస్యలను కలిగిస్తాయి. అదే పనిగా గోటిని కొరకడం ద్వారా వాటి చుట్టూ చీము చేరి ప్యారానైకియా కలిగే ముప్పు ఉంది.

* ఆ అలవాటు మానలంటే ముందుగా వాటిని కత్తిరించుకోవాలి. గోళ్లు చిన్నగా ఉండటం వల్ల కొరకడానికి వీలు కాదు. దీంతో సులభంగా ఈ అలవాటు నుంచి బయటపడొచ్చు.

* గోళ్లు కొరికే అలవాటు మానేయాలని బలంగా నిర్ణయించుకోండి. ఈ విషయాన్ని పదే పదే గుర్తుచేసుకోండి. ఇంట్లో కానీ మీరు పని చేసే చోటు ఓ నోటును రాసి అతికించుకోండి

* చేతికి రిస్ట్ బ్యాండ్‌ను ధరించండి. గోళ్లు కొరకాలి అనిపించగానే దాన్ని లాగి వదలండి.

* చాలా మంది అమ్మాయిలలో గోళ్ళు కోరికే అలవాటు ఉంటుంది. దాన్ని మానుకోవడానికి తరచుగా మెనిక్యూర్ చేయించుకోండి. అందంగా ఉన్న గోళ్లను కొరకాలని

ఎవరికీ అనిపించదు కావున గోళ్ళు కొరికే అలవాటు మానుకోవచ్చు.

*శరీరంలో ఉండే క్యాల్షియం లోపం కారణంగానూ గోళ్లు కొరకడం అలవాటు కావొచ్చు. కాబట్టి క్యాల్షియం ఉన్న ఆహరాన్ని తీసుకోండి.

* గోళ్లు కొరకాలని అనిపించినప్పుడు ఆలోచనలను దారి మళ్లించండి.

* చేతి వేళ్ళకు వేప ఆకులను పేస్టులా చేసి దాన్ని గోళ్లకు పూయండి. నోటిలో పెట్టుకున్నప్పుడు చేదుగా అనిపించడం కారణంగా గోళ్ళు కొరకడం మానుతారు.

* ఒత్తిడితో ఉన్నా గోళ్లను కొరుకుతుంటారు. కావునా ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ప్రాణాయామం సాధన చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories