కిచెన్‌లో బొద్దింకలు పోవాలంటే...

కిచెన్‌లో బొద్దింకలు పోవాలంటే...
x
Highlights

మన ఆహార బాండాగారం వంట రూం. మనం తినే ఆహారాన్ని తయారు చేసుకునే స్థలం కాబట్టి వంట గది క్లీన్ గా ఉంటేనే మనం అరోగ్యంగా ఉంటాం. కాబట్టి కిచెన్‌ను ఎప్పుడూ...

మన ఆహార బాండాగారం వంట రూం. మనం తినే ఆహారాన్ని తయారు చేసుకునే స్థలం కాబట్టి వంట గది క్లీన్ గా ఉంటేనే మనం అరోగ్యంగా ఉంటాం. కాబట్టి కిచెన్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. చాలామంది ఇళ్లల్లో కిచెన్‌లో బొద్దింకల సమస్య ఉంటుంది. దీంతో మార్కెట్లో దొరికే రకరకాల మందుల్ని ప్రయోగించి బొద్దింకలను నిర్మించడానికి ప్రయత్నిస్తాం. కానీ వాటిని శాశ్వతంగా తరిమికొట్టలేం. అయితే కొన్ని రకాల చిట్కాలతో వాటిని శాశ్వతంగా రాకుండా చేసుకోవచ్చు. ఆ చిట్కాలతో పాటు మరికొన్ని వంటింటి చిట్కాలను ఇక్కడ చదివేసేయండి..

కిచెన్‌లో బొద్దింకల సమస్యల ఉంటే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని దంచి నీటిలో కలిపి సింక్ పైప్ ఉంచాలి. ఇది బొద్దింకలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది. బొద్దింకలు మాయమవ్వాలంటే మరో చిట్కా బోరిక్ పౌడర్‌ దానిని ఉపయోగించవచ్చు.వంటింటి మూలల్లో బోరిక్ పౌడర్‌ను ఉంచితే బొద్దింకలు పోతాయి.బేకింగ్‌ సోడా,చక్కెర కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో చల్లడంతో సులభంగా బొద్దింకలను తరిమికొట్టవచ్చు.

వీటితో పాటు వంటింట్లో ఉపయోగించే మరికొన్ని చిట్కాలు. గుడ్లు ఉడకపెట్టే పాత్ర నల్లగా మారకుండా ఉండాలంటే ఆ నీళ్లల్లో కాస్త ఉప్పు వేయాలి. దీంతో అది నల్లగా మారకుండా ఉంటుంది. నిమ్మకాయలు కట్ చేసేముందు వాటిని రెండు చేతులతో కాస్త వత్తినట్టుగా చేస్తే ఎక్కువ రసం వస్తుంది. అలాగే పచ్చి మిరపకాయలు స్టోర్ చేసేటప్పుడు వాటి తొడిమలు తీసివేస్తే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఉల్లిపాయలు తరిగేటప్పుడు కళ్లు మండకుండా ఉండాలంటే ఉల్లిపాయను రెండు ముక్కలు చేసి నీళ్లల్లో కాసేపు ఉంచాక కట్ చేయాలి. ఇలాంటి చిట్కాలు పాటించడం ద్వారా వంటింటి సమస్యలను సులభంగా పరిష్కారించుకోవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories