Antibodies: శరీరంలో యాంటీ బాడీస్‌ ను పెంచుకోవాలంటే..

Tips To Improve Antibodies
x
యాంటీబాడీస్ (ఫైల్ ఇమేజ్)
Highlights

పుల్లగా ఉండే పండ్లు తింటే... యాంటీబాడీస్ అద్భుతంగా పెరుగుతాయి.

Antibodies: యాంటీ బాడీస్... యాంటీ బాడీస్ అంటూ మనం ఈ మధ్య కాలంలో తరచుగా వింటున్నాం. కరోనా ప్రారంభం అయినప్పటి నుండి ఈ పదం బాగా వినపడుతోంది. అసలు యాంటీ బాడీస్ అంటే వ్యాధి నిరోధక శక్తి(ఇమ్యూనిటీ). అంటే మన శరీరంలో చొరబడే కరోనా లాంటి వ్యాధులను ఎదుర్కొనే శక్తి మన శరీరం కలిగి వుండటం. దాన్ని పెంచుకోవడం కోసం మనం వ్యాక్సిన్లు వేసుకుంటున్నాం. అసలు వ్యాక్సిన్‌ లేకుండానే యాంటీబాడీలను బాగా పెంచుకుంటే... అప్పుడు కరోనా సోకినా దానితో శరీరం పోరాడగలదు. మరి యాంటీ బాడీస్ ను పెంచుకోవడం ఎలానో మన 'లైఫ్ స్టైల్ 'లో చూద్దాం...

రోజూ మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు ఉండేలా చూసుకుంటే, మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా ఎన్నో వ్యాధులను తరిమి కొట్టొచ్చని వైద్య ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు చెబుతున్నాయి.ప్రొటీన్ అధికంగా వుండే మాంసం, చికెన్, గుడ్లు బాగా తినాలి. అంతేకాదు... జీడిపప్పు, బాదం వంటి వాటిలో ప్రోటీన్స్ బాగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. వీటిని కూడా మితంగా నే తీసుకోవాల్సి వుంటుంది.

ఏ సీజన్లో దొరికే పండ్లను రెగ్యులర్ గా తీసుకుంటూ వుండాలి. విటమిన్ A, C, E ఉండే పండ్లు బాగా తినండి. పుల్లగా ఉండే పండ్లు తింటే... యాంటీబాడీస్ అద్భుతంగా పెరుగుతాయి. టమాటాలు, నిమ్మకాయలు, కమలాలు, బత్తాయిలు, ద్రాక్ష, పుచ్చకాయ, బొప్పాయి, బ్రకోలీ ఇవన్నీ తీసుకోవచ్చు.

రోజూ ఓ అరగంటైనా ఖచ్చితంగా నడవాలి. శరీరాన్ని అలసిపోయే విధంగా యోగా లేదా జాగింగ్ వంటివి చేస్తూ వుండాలి. ఇంటిని శుభ్రం చేసుకోవడం, మొక్కలకు నీళ్లు పొయ్యడం... ఇలా ఏవో ఒక పనులు చేయాలి. మన పనులు మనమే చేసుకుంటే... శారీరక శ్రమ ఉంటుంది. ఐతే... కొంతమందిలా గంటలతరబడి జిమ్‌ ఎక్సర్‌సైజ్‌లు చెయ్యవద్దు. దాని వల్ల తెల్లరక్తకణాలకు సమస్య వస్తుంది.

ఉదయం సాయంత్రం వేళ సూర్యుడి ఎండ తగిలేలా చేసుకోండి. లేదా డాక్టర్ల సలహాతో విటమిన్ డి టాబ్లెట్లు వేసుకోండి. టెన్షన్ లేని జీవితాన్ని అలవరుచుకోవాలి. ఈ కాలంలో అది సాధ్యమయ్యే పని కాదులేండి. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు యోగా, ఇంట్లో పెంపుడు జంతువులతో కాసేపు ఆడుకోండి. కామెడీ వీడియో బిట్లు చూడండి. మీకు ఇష్టమైన పని చేస్తూ వుంటే ఒత్తిడిని ఎదుర్కోవచ్చు.

వేపుళ్లు తగ్గించి... ఉడకబెట్టినవి, పులుసు వంటలు ఎక్కువ తినండి. మసాలాలు తగ్గించండి. మొలకలు తినండి. బాడీలో కొవ్వు రాకుండా చూసుకోండి. అప్పుడు యాంటీబాడీస్... పెద్ద సంఖ్యలో తయారవుతాయి.

కరోనా కట్టడికి లాక్ డౌన్ విధిస్తే మధ్యంషాపుల వద్ద పెద్దఎత్తున క్యూలు కట్టారు. అంటే మద్యానికి ఎంత మంది బానిసలయ్యారో తెలుస్తోంది. కానీ మద్యం యాంటీబాడీస్‌ని చంపేస్తుంది. మద్యం పొట్టలోకి వెళ్లగానే యాంటీ బాడీలు గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోతాయి. మనకు కరోనా వైరస్ రాకుండా అడ్డుకునే యాంటీబాడీస్‌ని మనం కాపాడుకోకపోతే ఎలా?

ఇవన్నీ గతంలో మన పెద్దవాళ్లు ఆచరించిన పద్దతులేనండి. కానీ సమాజం వేగంగా పరిగెడుతూ కొన్ని విలువల్ని గాలికొదిలేస్తున్నాము. దీంతో కరోనా లాంటి మహమ్మారులు మనల్ని ఆడేసుకుంటున్నాయి. సో కొన్ని మనకు కష్టమైనా ఇష్టాంగా పద్దులను మార్చుకుంటే యాంటీ బాడీస్ కోసం ఆరాట పడాల్సిన అవసరం లేదు. కరోనా దాని జేజెమ్మ వచ్చినా మనల్ని ఏమీ చేయలేవు. కరోనా లాంటి జబ్బుల నుండి కాపాడుకోవాలంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తిన పెంచుకోవడం ఒక్కటే మార్గం. ఎన్ని వ్యాక్సిన్లు వాడినా అవి తాత్కాలికమే అనేది మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం

Show Full Article
Print Article
Next Story
More Stories