హై హీల్స్ వాడుతున్నారా....ఈ టిప్స్ పాటించండి...నొప్పులన్నీ ఫటాఫట్‌

హై హీల్స్ వాడుతున్నారా....ఈ టిప్స్ పాటించండి...నొప్పులన్నీ ఫటాఫట్‌
x
Highlights

స్టైల్ కి ఐకాన్స్ అమ్మాయిలు..ఎప్పటికప్పుడు వచ్చే ట్రెండ్‌ను ఫాలో అవ్వడంలో యమ ఫాస్ట్‌గా ఉంటారు..కాలికి వేసుకునే చెప్పుల దగ్గరి నుంచి హెయిర్‌ క్లిప్...

స్టైల్ కి ఐకాన్స్ అమ్మాయిలు..ఎప్పటికప్పుడు వచ్చే ట్రెండ్‌ను ఫాలో అవ్వడంలో యమ ఫాస్ట్‌గా ఉంటారు..కాలికి వేసుకునే చెప్పుల దగ్గరి నుంచి హెయిర్‌ క్లిప్ వరకు ట్రెండీగా ఉండేందుకు ఇష్టపడుతుంటారు...ఇక ఎత్తు చెప్పుల విషయానికి వస్తే....అదేనండి హైహీల్స్..అమ్మాయిలు షార్టైనా , హైట్‌గా ఉన్నా వీటిని వేసుకునేందుకు ముందుంటున్నారు. తమ స్టైల్ లుక్ కి హైహిల్స్ ప్లస్ అవుతుండడంతో వీటికి డిమాండ్ ఉంది.. కానీ ఎత్తు చెప్పులు వేసుకోవడం వల్ల ఎన్నో అనర్థాలు కూడా ఉన్నాయి.వాటిని అధిగమించేందుకు...మనం ఇప్పుడు కొన్ని టిప్స్ చూద్దాం....

ఎత్తు చెప్పులు వేసుకునేవారు ప్లాట్‌ఫాం హీల్స్‌ను ఎంచుకోండి.. ఇవి పాదాలకు ఆసరాగా ఉంటాయి. మిగతావి ప్రయత్నిస్తున్నప్పుడు కచ్చితంగా మూడు గంటలకు మించి వాటిని వేసుకోకపోవడమే ఉత్తమం. ఒకవేళ ఎక్కువ దూరం నడవాల్సి వచ్చినా, నిల్చోవాల్సి వచ్చినా తమ వెంట ఓ జత ఫ్లాట్స్‌ ఉంచుకోవడం మంచిది. లేదా ఎత్తుచెప్పుల్ని ఇప్పేసి కాసేపు నడవాలి. అలా చేయడం వల్ల వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇలా చేయడం తమ వల్ల కాదు అనుకునే వారు ఆర్థోపెడిక్‌ ప్యాడ్స్‌ని ఉపయోగించవచ్చు..ఈ ప్యాడ్స్‌ను ఎక్కువ సమయం హీల్స్‌ వేసుకునేవారు చెప్పుల లోపల ఉంచితే పాదాలకు ఆసరాగా ఉంటాయి. ఏ నొప్పి ఉండదు. దీనితో పాటే జెల్‌ప్యాడ్స్‌ మరింత సౌకర్యంగా అనిపిస్తాయి.

ఎత్తు చెప్పులు వేసుకునేవారు పాదాలకు తగిన వ్యాయామం అవసరం. హై హీల్స్ వేసుకునే ముందు పాదాలను స్ట్రెచ్‌ చేయడం మంచిది. పాదం అడుగున బంతిని ఉంచి... దానిపై పాదం పెట్టి ప్రెజర్‌తో నొక్కుతూ బంతిని గుండ్రంగా తిప్పాలి. ఇలా చేస్తే కండరాలు వదులుగా అవుతాయి. సో హై హీల్స్ వేసుకున్నా...ఎలాంటి నొప్పి లేకుండా హాయిగా ఉండొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories