Top
logo

ఎక్కువ సేపు కూర్చోని పనిచేస్తున్నారా..!

ఎక్కువ సేపు కూర్చోని పనిచేస్తున్నారా..!
X
Highlights

చాల మంది ఎక్కువ సేపు కూర్చోని పనిచేస్తుంటారు. ముఖ్యంగా సాప్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్ళు కంప్యూటర్ ముందే కూర్చోని...

చాల మంది ఎక్కువ సేపు కూర్చోని పనిచేస్తుంటారు. ముఖ్యంగా సాప్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్ళు కంప్యూటర్ ముందే కూర్చోని వర్క్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ విధుల్లో భాగంగా ఐదు గంటలకన్నా ఎక్కువసేపు కూర్చోని పరి చేసే ఉద్యోగులు చాలమంది ఉన్నారు. అయితే అలా ఎక్కువ సేపు కూర్చోని పనిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కూర్చోని వర్క్ చేయడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు శరీరంలో చెడు కొలెసాట్రల్‌ పెరుగుతుందని, అదేసమయంలో మంచి కొలెసాట్రల్ స్థాయులు తగ్గుతున్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది.

రోజుకు 9 గంటలకు మించి కూర్చోని ఉంటే.. ముందుగానే మరణం సంభవించే ముప్పు ఉందని నార్వేజియన్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నిద్రను మినహాయిస్తే.. మనం కూర్చుని ఉండే సమయం రోజుకు 9 గంటలకు కంటే ఎక్కువ ఉండకూడదని చెబుతున్నారు పరిశోధకులు.

Next Story