ఊరు అమ్మబడును!.. ధర కేవలం రూ. 26.28 కోట్లు మాత్రమే..

ఊరు అమ్మబడును!.. ధర కేవలం రూ. 26.28 కోట్లు మాత్రమే..
x
Highlights

ఇల్లు అమ్మడం గురించి తెలుసు కానీ.. ఊరు అమ్మడం ఏంటా అని అలోచిస్తున్నారా..! అవునండీ ఇది నిజంగా నిజమే.. గ్రామస్థులు వాళ్ల ఊరిని అమ్మేలయాలనకుంటున్నారట!...

ఇల్లు అమ్మడం గురించి తెలుసు కానీ.. ఊరు అమ్మడం ఏంటా అని అలోచిస్తున్నారా..! అవునండీ ఇది నిజంగా నిజమే.. గ్రామస్థులు వాళ్ల ఊరిని అమ్మేలయాలనకుంటున్నారట! అంతేకాదు.. ఆ ఊరుకి ధరని కూడా నిర్ణయించారు. కేవలం రూ.26.28 కోట్లు మాత్రమేనట. ఇంతకీ ఆ ఊరు ఎక్కడ అనుకుంటున్నారా.. మన దగ్గర కాదులేండీ.. అమెరికాలో ఉంది. అమెరికాలోని ఇండియానాలో ఉన్న ఊరి పేరు స్టోరీ. ఆ ఊర్లో నివసించేది ముగ్గురు. అవును ముగ్గురు మాత్రమే నివసించే ఆ ఊరిని ఇప్పుడు అమ్మేయాలనుకుంటున్నారు. ఆ ఊరికి సదుపాయాలు లేవు అందుకనే అమ్ముతున్నారేమో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆ ఊర్లో అన్ని సదుపాయాలున్నాయి. గ్రామం చిన్నపాటి ఫిల్మ్‌సిటీని తలపిస్తుంది. ఇక్కడికి పర్యాటకులు కూడా వస్తుంటారు.

అక్కడ హోటల్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. 2015 తర్వాత పర్యాటకుల రద్దీ పెరిగింది. అక్కడ ఉన్న పాత భవనాలను కాటేజీలుగా మార్చి పర్యాటకులకు అద్దెకిస్తున్నారు. అయినా కానీ ఆ ఊర్లో నివసించడానికి వాళ్లు ఇష్టపడడం లేదు. ఆ ఊరిని అమ్మేయేటానికే మొగ్గు చూపుతున్నారు. ఆ ఊరి ధర రూ. 26.28 కోట్లుగా నిర్ణయించారు. 173 ఎకరాల్లో ఉన్న ఈ గ్రామంలో ఒకప్పుడు 175 మంది దాకా నివసించే వారు. రాను రాను ఆ సంఖ్య అంతరించిపోయి మూడుకు చేరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories