Health Tips: వేసవిలో మలబద్దకం సమస్యకి ఈ పండ్లు బెస్ట్‌.. కచ్చితంగా డైట్‌లో చేర్చుకోండి..!

These Fruits are Best for Constipation Problem in Summer Definitely include it in the Diet
x

Health Tips:వేసవిలో మలబద్దకం సమస్యకి ఈ పండ్లు బెస్ట్‌.. కచ్చితంగా డైట్‌లో చేర్చుకోండి..!

Highlights

Health Tips: వేసవిలో నీరసం, అలసట ఎక్కువగా ఉంటాయి.

Health Tips: వేసవిలో నీరసం, అలసట ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితిలో మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. డీహైడ్రేషన్ కారణంగా జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా చాలా మంది మలబద్ధకం బారిన పడుతున్నారు. అందుకే వేసవిలో తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే పండ్లను చేర్చుకోవాలి. ఇవి అజీర్ణం, కడుపునొప్పి, మలబద్ధకం వంటి సమస్యల నుంచి కాపాడుతాయి. అయితే ఆహారంలో ఏ పండ్లను చేర్చుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

పియర్

పియర్‌లో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. ఇవి పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీరు సలాడ్ రూపంలో కూడా వీటిని తీసుకోవచ్చు.

సిట్రస్‌ ఫలాలు

సిట్రస్ పండ్లలో నారింజ, ద్రాక్ష, జామ ఉంటాయి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇందులో పెక్టిన్ అధికంగా ఉంటుంది. ఇది కరిగే ఫైబర్. ఇది సిట్రస్ పండ్లలో సమృద్ధిగా దొరుకుతుంది. ఇది మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఆపిల్

ఆపిల్‌లో కరిగే, కరగని ఫైబర్ రెండు ఉంటాయి. ఇది మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఆపిల్ మీకు అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది మిమ్మల్ని అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది.

అరటిపండ్లు

అరటిపండు చాలా రుచికరమైన పండు. ఇది మలబద్ధకం సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం చికిత్సలో ఉపయోగపడుతుంది. డయేరియా చికిత్సకు అరటిపండు ఉపయోగకరంగా ఉంటుంది. అరటిపండును అనేక రకాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories