Stress: ఒత్తిడితో చిత్తవుతున్నారా.? తీసుకునే ఆహారంలో ఈ ఫుడ్‌ ఉండాల్సిందే..!

These Foods Can Help Reduce Stress Naturally
x

Stress: ఒత్తిడితో చిత్తవుతున్నారా.? తీసుకునే ఆహారంలో ఈ ఫుడ్‌ ఉండాల్సిందే..!

Highlights

Stress: ప్రస్తుతం ఒత్తిడితో చిత్తవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మారిన జీవన విధానం, మారిన పనివేళలు కారణం ఏదైనా ఒత్తిడితో బాధపడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది.

Stress: ప్రస్తుతం ఒత్తిడితో చిత్తవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మారిన జీవన విధానం, మారిన పనివేళలు కారణం ఏదైనా ఒత్తిడితో బాధపడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఒత్తిడిని దూరం చేయాలంటే యోగా, మెడిటేషన్‌ వంటివి అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. వీటన్నింటితో పాటు తీసుకునే ఆహారంలో మార్పులు కూడా చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఒత్తిడి తగ్గాలంటే తీసుకునే ఆహౄరంలో లైకోపీన్‌ ఉండే ఫుడ్‌ను తీసుకోవాలని చెబుతున్నారు. ఒత్తిడి తగ్గించడంలో ఉపయోగించే యాంటి డిప్రెసెంట్స్‌తో పోల్చితే లైకోపీన్‌ మెరుగైన ఫలితాలను అందిస్తుంది. లైకోపీన్‌లో ఉన్న న్యూరోప్రొటెక్టివ్‌ గుణాలు నాడీవ్యవస్థను కాపాడి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ అధ్యయనంలో ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించగా, లైకోపీన్‌ తినిపించిన ఎలుకలకు డిప్రెషన్‌ లక్షణాలు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.

లైకోపీన్ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు

లైకోపీన్ కెరాటినాయిడ్లలో సహజంగా లభించే ఒక ముఖ్యమైన పోషక పదార్థం. ఇది పండ్లకు ఎరుపు, గులాబి రంగులను అందిస్తుంది. టమాటాలు, పుచ్చకాయ, ద్రాక్షపండ్లు, జామ – ముఖ్యంగా ఎర్ర జామ, ఎర్ర క్యాప్సికమ్‌లో లైకోపీన్‌ అధికంగా ఉంటుంది. ఇలాంటి ఆహారాన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే మానసిక సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. కాగా లైకోపీన్‌తో గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. లైకోపీన్‌ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు కలిగి ఉంది. ఇది రక్తంలో మెరుగైన రక్తప్రసరణను ప్రోత్సహించి, హృదయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. లైకోపీన్ అధికంగా ఉండే ఆహారాలను తినడం వల్ల రక్తపోటు నియంత్రణ, హృదయ సంబంధిత సమస్యలను నివారిస్తుందని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories