Health Tips: ఈ ఆహారాలు గుండెకి శత్రువులు.. అయినా ఇష్టంగా తింటారు..!

These 5 foods are enemies of the heart reasons for heart attacks
x

Health Tips: ఈ ఆహారాలు గుండెకి శత్రువులు.. అయినా ఇష్టంగా తింటారు..!

Highlights

Health Tips: ఈ ఆహారాలు గుండెకి శత్రువులు.. అయినా ఇష్టంగా తింటారు..!

Health Tips: గుండె మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ఇది జీవితాంతం కొట్టుకుంటూనే ఉంటుంది. ఇది ఆగిపోతే మరణం సంభవించినట్లే. అందుకే గుండెని ఆరోగ్యంగా చూసుకోవడం అవసరం. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకి గుండెజబ్బులే కారణం. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి దీనికి కారణమని చెప్పవచ్చు. మొదట కొలెస్ట్రాల్ పెరుగుతుంది తరువాత రక్తపోటు పెరుగుతుంది తర్వాత గుండెపోటు వస్తుంది. హృదయానికి మంచివి కాని ఆహారాల గురించి తెలుసుకుందాం.

1. బ్లెండెడ్ కాఫీ

బ్లెండెడ్ కాఫీలో కేలరీలు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే కేఫిన్ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. రక్తపోటును పెంచేలా చేస్తుంది. ఆపై గుండెపోటుకు దారితీస్తుంది.

2. ఇన్‌స్టంట్ నూడుల్స్

ఇన్‌స్టంట్ నూడుల్స్ ప్రతి కళాశాల విద్యార్థికి, ఒంటరి వ్యక్తులకు బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే ఇది త్వరగా, సులభంగా తయారవుతుంది. కానీ క్రమం తప్పకుండా తింటే ఆరోగ్యానికి హానికరం. ఇందులో నూనె, సోడియం ఎక్కువగా వాడటం వల్ల రక్తపోటు పెరిగి గుండెపోటు వస్తుంది.

3. ఫ్రెంచ్ ఫ్రైస్

ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా వేడి నూనెలో వండుతారు. ఇందులో చాలా సోడియం, ట్రాన్స్ ఫ్యాట్స్, పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఇది గుండె సంబధిత సమస్యలకి కారణం అవుతుంది.

4. పిజ్జా

పిజ్జా చాలా మంది యువత మొదటి ఎంపిక. కానీ ఇందులో కొవ్వు, సోడియం అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే చీజ్ కొలెస్ట్రాల్ రక్తపోటును పెంచుతుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. మీరు ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకుంటే పిజ్జా తయారీలో గోధుమలు, ఆలివ్ నూనెను ఉపయోగించాలి.

5. రెడ్ మీట్‌

రెడ్ మీట్‌లో చాలా సంతృప్త కొవ్వు, ఉప్పు ఉంటుంది. కాబట్టి అలాంటి మాంసాన్ని నెలకు ఒకసారి మాత్రమే తీసుకోవడం మంచిది. ఇది ప్రోటీన్ అవసరాన్ని తీర్చినప్పటికీ అధిక కొవ్వు కొలెస్ట్రాల్‌ను పెంచి గుండెపోటుకు కారణం అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories