వర్షం పడిందని జిమ్‌కు వెళ్లలేదా! అయితే ఇంట్లోనే ఈ వర్క్‌ అవుట్స్ చేయండి..

Highlights

జిమ్ వెళ్ళలంటే అసలే బద్దకం.. దీనికి సూచయిగా ఇకా ఆరుబయట వర్షం పడిందో ఆ వంకతో ఇంట్లోనే ఉండిపోతాం. అలా కాకుండా వర్షం పడినప్పుడు ఇంట్లోనే ఎంచక్కా...

జిమ్ వెళ్ళలంటే అసలే బద్దకం.. దీనికి సూచయిగా ఇకా ఆరుబయట వర్షం పడిందో ఆ వంకతో ఇంట్లోనే ఉండిపోతాం. అలా కాకుండా వర్షం పడినప్పుడు ఇంట్లోనే ఎంచక్కా చేయదగ్గ, తేలికైన ఎక్సర్‌సైజ్‌లు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

జంప్‌ రోప్‌ స్కిప్పింగ్‌ ఇది ఎక్కుడైనా చేయగలగే తెలికైనా వ్యాయమం.కొంచెం ఎత్తుతో గెంతుతూ ఉండడం వల్ల నిమిషానికి 10 నుంచి 16 క్యాలరీలు శరీరంలో ఖర్చవుతాయి. దీంతో పాదాలు తేలికవుతాయి. ఈ ఎక్సర్‌సైజ్‌ వల్ల చేతులు, కాళ్లకు చక్కని వ్యాయామం లభిస్తుంది.

ఫ్లయోమెట్రిక్‌ ఎక్సర్‌సైజ్‌ కూడా ఈ చాలా తెలికైనదే. ఈ కసరత్తుతో కండరాలు దృఢంగా మారుతాయి. జంప్‌ స్క్వాట్స్‌, క్లాప్‌ పుషప్స్‌, హై స్పీడ్‌ సిట్‌ అప్స్‌ వంటివి ఫిట్‌గా కనిపించేలా చేస్తాయి.

కోర్‌ ట్రైనింగ్‌ వ్యాయమంతో లోయర్ బాడీ స్ట్రాంగ్ మారుతుంది. క్రంచె్‌సతో పాటు పొట్ట భాగాన్ని గట్టిగా మార్చే వ్యాయామం ఇది. పరుగెత్తే సమయంలో వెన్నెముక కింది భాగంలో వచ్చే నొప్పిని అడ్డుకుంటుంది. సైడ్‌ ప్లాంక్స్‌, ప్లాంక్స్‌, రొటేషనల్‌ క్రంచెస్‌, ఫ్లట్టర్‌ కిక్స్‌ను ముప్ఫయి సెకన్ల పాటు చేస్తే బాడీ బలంగా మారుతుంది.

ఒంటి కాలు మీద నిల్చొని చేతితో డంబెల్స్‌ ఎత్తడమే బ్యాలన్స్‌ ఎక్సర్‌సైజ్స్‌., కాలిమడిమ, మునివేళ్ల మీద నడవడంతో పాటు వృక్షాసనం వంటివి చేయవచ్చు. కళ్లు మూసుకొని ముందుకూ, వెనక్కీ గదిలో నెమ్మదిగా నడుస్తూ, శరీరాన్ని బ్యాలన్స్‌ చేస్తుండాలి

స్టాటిక్‌ స్ట్రెచింగ్‌ కసరత్తుతో ఎక్కువ దూరం పరుగెత్తేందుకు వీలుగా ఉంటుంది.. తొడకండరాలు గట్టిపడేందుకు ఈ వ్యాయామం ఉపయోగపడుతుంది, హిప్‌, బైసెప్స్‌ వంటివి 30 సెకన్ల పాటు ఈ స్ట్రెచెస్‌ చేయాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories