మనం తినే తిండితోనే బరువుకు చెక్ చెప్పవచ్చు

మనం తినే తిండితోనే  బరువుకు చెక్ చెప్పవచ్చు
x
Highlights

ముల్లును ముల్లుతోనే తీయాలి అలాగే మనం పెరిగే బరువును కూడా మనం తినే తిండితోనే కట్టడి చేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది వినడానికి ఆశ్చర్యంగా...

ముల్లును ముల్లుతోనే తీయాలి అలాగే మనం పెరిగే బరువును కూడా మనం తినే తిండితోనే కట్టడి చేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు అవును ఇది ముమ్మాటికి నిజం ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలొ ఈ విషయం వెల్లడైంది. నెమ్మదిగా భోజనం చేపేవారిలో ఊబకాయం లక్షణాలు తగ్గుతున్నట్లు జపాన్ పరిశోధకులు తెలిపారు. ఆహారం తీసుకునే సమయంలో కడుపు నిండగానే ఇక తినడం చాలించాలి అనే సంకేతాలు మెదడుకి చేరుతాయి.

ఈ సిగ్నల్స్ మన మెదడుకి చేరటానికి సుమారు 20 నిమిషాలు పడుతుంది. అదే వేగంగా భోజనం చేశామనుకోండి. కడుపు నిండిందనే సంకేతాలు మెదడుకు చేరే లోపే అవసరమైన దాని కంటే తినేసి ఉంటాం. దీంతో బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల నెమ్మదిగా కనీసం 30 నిమిషాలు పాటు భోజనం చేయడం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. ఒక్కో ముద్దను 15-30 సార్లు నోటితో నమిలి తినాలని సూచిస్తున్నారు. దీని ద్వారా నెమ్మదిగా భోజనం చేపినట్టు అవుతుంది అలాగే పోషకాలు కూడా బాగా ఒంట పడతాయి.

భోజ‌నం చేసిన వెంట‌నే ఈ ప‌నులు చేయ‌రాదు

* భోజ‌నం చేశాక ఎట్టి ప‌రిస్థితిలోనూ స్మోకింగ్ చేయ‌రాదు. పొగాకులో ఉండే నికోటిన్ శ‌రీరంలో జరిగే జీర్ణ క్రియ‌ను అడ్డుకుంటుంది. . కావున భోజ‌నం చేశాక పొగ తాగ‌రాదు.

* భోజ‌నం చేసిన వెంట‌నే స్నానం కూడా చేయ‌రాదు. దీనివల్ల జీర్ణ ప్ర‌క్రియ‌కు ఆటంకం క‌లుగుతుంది. భోజ‌నం చేశాక స్నానం చేద్దామ‌నుకుంటే క‌నీసం 40 నిమిషాల వ‌ర‌కు ఆగాలి

* చాలా మంది భోజ‌నం చేసిన తర్వాత పండ్ల‌ను తీసుకుంటుంటారు. కానీ అలా చేయవద్దు. మ‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం సరిగ్గా గ్ర‌హించాలంటే పండ్ల‌ను తిన‌రాదు. 60 నిమిషాల వ్య‌వ‌ధి తర్వాత పండ్ల‌ను తింటే మంచిది.

* భోజనం చేశాక గ్రీన్ టీ తీసుకోవద్దు. తాగితే ఆహారంలో ఉండే ఐర‌న్‌ను స‌రిగ్గా గ్ర‌హించ‌లేదు.

* భోజనం చేసిన వెంట‌నే వ్యాయామం చేయ‌రాదు,అలాగే ఎక్కువ సేపు కూడా కూర్చోరాదు.అలాగే తిన్న వెంట‌నే నిద్రించ‌కూడదు.

Show Full Article
Print Article
Next Story
More Stories