కాల్షియం లేమి తో బాధపడే వారికి సరైన వంటకం

కాల్షియం లేమి తో బాధపడే వారికి సరైన వంటకం
x
Highlights

కాల్షియం లేమి తో బాధపడే చాలా మందికి డాక్టర్లు సూచించే నాన్‌వెజ్ వంటకం పాయా సూప్. బ్యాక్‌పెయిన్‌తో , మోకాళ్ల నొప్పితో బాధపడే అడవారికి ఈ పాయా సూప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

కాల్షియం లేమి తో బాధపడే చాలా మందికి డాక్టర్లు సూచించే నాన్‌వెజ్ వంటకం పాయా సూప్. బ్యాక్‌పెయిన్‌తో , మోకాళ్ల నొప్పితో బాధపడే అడవారికి ఈ పాయా సూప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే యముకల విరిగిపోయిన వారికి ఈ సూప్‌ మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. హైదాబాద్ మహానగరం బిర్యానికీ, హలీమ్ కి ఎంత ఫేమస్సో పాయ సూప్‌కి కూడా అంతే ఫేమస్‌. పాత బస్తీలో విరివిగా ఈ సూప్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో వేడి వేడిగా పాయా సూప్ తాగితే ఆ మజానే వేరంటారు భోజన ప్రియులు...జలుబు, జ్వరం తో బాధపడే వారు ఒక్కసారి ఈ సూప్ తాగితే చాలా ఎంతో రిలాక్స్ అవుతారు..మరి ప్రతి సారి పాయా తాగాలంటే ఓల్డ్ సిటీ వరకు వెళ్లనవసరం లేదు..మన ఇంట్లోనే ఈ టేస్టీ పాయా సూప్ ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం...పదండి..

కావాల్సిన పదార్ధాలు:

మేక కాళ్లు : నాలుగు

♦ కారం : నాలుగు టేబుల్ స్పూన్‌లు

♦ ఉల్లిగడ్డ : రెండు

♦ పూదీనా :ఒక కట్ట

♦ నూనె : తగినంత

♦ అల్లంవెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్

♦ పచ్చికొబ్బరి తురుము : అర కప్పు

♦ గసగసాల పేస్ట్‌ : అర టీస్పూన్

♦ కొత్తిమీర : ఒక కట్ట

♦ యాలాకులు పౌడర్ : అర టీస్పూన్

♦ దాల్చీని : అర టీస్పూన్

♦ పసుపు : చెంచా

♦ నిమ్మకాయ : ఒకటి

♦ లవంగాల పౌడర్: అర టీస్పూన్

♦ దనియాల పౌడర్ : అర టీస్పూన్

♦ ఉప్పు : రుచికి సరిపడా

తయారీ విధానం:

పాయా సూప్ ను మటన్ కాళ్లతోనే చేస్తారు . మేక కాళ్లను డైరెక్ట్ గా వాడేయకుండా..ముందుగా బాగా కాల్చుకోవాలి...కాల్చిన కాళ్లను తీసుకుని పసుపు వేసి వాసన పోయేంత వరకు బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గసగసాలను , కొబ్బరిని తీసుకుని మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. ముఖ్యంగా మటన్‌ను కుక్కర్‌లో వండితేనే మంచిగా ఉడుకుతుంది. అందుకే మటన్ కాళ్లను ప్రెషర్ కుక్కర్ లో వేసుకోవాలి..ఇప్పుడు అందులోనే కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పూదీనా ఆకులు, కొత్తిమీర, నీళ్లు పోసి మూత పెట్టుకుని ఉడికించాలి. హై ఫ్లేమ్ కి బదులుగా మీడిమ్ మంట మీద బోన్స్ ను ఉడకబెట్టాలి.

ఇప్పుడు ఒక కాడయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక దాల్చీని, యాలాకులు, లవంగాల పొడితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని సిమ్ లో వేయించాలి. ఉప్పుడు ఉల్లిపాయలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు దనియాల పొడి, మిగిలి అల్లం పేస్ట్ , కారం వేసుకుని వేయించాలి. తరువాత కుక్కర్ లో ఉడికించి పెట్టుకున్న మేక కాళ్లను కడాయిలో వేసుకోవాలి...నీటిని కూడా ఇందులో వేసుకోవాలి...బాగా కలుపుకోవాలి. పది నిమిషాల పాటు మసాలా కాళ్లకు బాగా పట్టే వరకు మరిగించి దించేయాలి..చలి కాలంలో వేడి వేడి పాయా సూప్ తాగితే ఫిదా అవ్వాల్సిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories