Top
logo

చందమామ పరిస్థితి మరీ ఇంత దారుణమా?

చందమామ పరిస్థితి మరీ ఇంత దారుణమా?
X
Highlights

ఈ ప్రపంచంలో జాబిలి అంటే ఇష్టం ఉండని వారంటూ ఉండరు. అమ్మ గోరుముద్దులు తృప్తిగా తినాలంటే చందమామ ఉండాల్సిందే....

ఈ ప్రపంచంలో జాబిలి అంటే ఇష్టం ఉండని వారంటూ ఉండరు. అమ్మ గోరుముద్దులు తృప్తిగా తినాలంటే చందమామ ఉండాల్సిందే. రాత్రి సమయంలో జాబిలి వంక అలా చూస్తే చాలు.. చల్లటి ఆహ్లాదాన్ని మనసు సొంతం చేసుకుంటుంది. ఇప్పుడు అలాంటి అనుభూతి పంచే చందమామకి కష్టకాలం వచ్చిపడింది. జాబిల్లి మనుగడకే ముప్పు వచ్చింది. అవును నాసా శాస్త్రవేత్తల పరిశోధనల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

చంద్రుడు రానురాను కుంచించుకుపోతున్నట్లు నాశా పరిశోధనల్లో వెల్లడైంది. ద్రాక్ష పండు ఎండిపోతున్నప్పుడు చర్మం ఎలా మారుతుందో.. చంద్రుడి ఉపరితలం అదేవిధంగా రూపాంతరం చెందుతున్నదని స్పష్టం చేసింది నాసా. గడిచిన కొన్ని కోట్ల ఏళ్ల కాలంగా దాదాపు 150 అడుగుల మేర కుంచించుకుపోయినట్టు వెల్లడించింది. చంద్రుడిపై పరిశోధనల కోసం నాసా పంపిన ఎల్‌ఆర్వో ఎయిర్‌క్రాఫ్ట్ అందించిన 12 వేల ఫొటోలను, అపోలో మిషన్లలో భాగంగా చంద్రుడిపై బిగించిన సిస్మోమీటర్లు అందించిన సమాచారాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చారు. ఉత్తర ధ్రువం పూర్తిగా కుంచించుకుపోయినట్లు.. ఉపరితలంపై పగుళ్లు ఏర్పడుతున్నట్లు గుర్తించారు.

Next Story