వంట గది శుభ్రంగా ఉండాలంటే...

వంట గది శుభ్రంగా ఉండాలంటే...
x
Highlights

మనకు వచ్చే 90 శాతం రోగాలు తీసుకునే ఆహారం ద్వారానే వస్తాయని వైద్వులు చెబుతున్నారు. కాబట్టి ఆహారాన్ని వండే విధానంలో జాగ్రాత్తలు పాటించాలి, ముఖ్యంగా ఆహర...

మనకు వచ్చే 90 శాతం రోగాలు తీసుకునే ఆహారం ద్వారానే వస్తాయని వైద్వులు చెబుతున్నారు. కాబట్టి ఆహారాన్ని వండే విధానంలో జాగ్రాత్తలు పాటించాలి, ముఖ్యంగా ఆహర బండగారమైన వంట గది శభ్రంగా ఉండాలి. మనకు తెలియకుండానే వంటగదిలో చెత్త పేరుకుపోతుంటుంది. ఓపిక లేక ఒక్క రోజు సర్దకుండా ఊరుకుంటే చాలు అస్తవ్యస్తంగా తయారైపోతుంది. వంట గది అలా ఉండాకుండా శుభ్రంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే వంటింటిని అందంగా, శుభ్రంగా ఉంచొకొవచ్చు.

వంటగదిలో అతి ఎక్కువగా వాడేది ఫ్రిజ్‌. కూరగాయలు ఇతర వంట సామగ్రిని ఎక్కువుగా ఫ్రిజ్‌ లోనే పెడుతుంటాం. దాన్ని మెయిన్ టేన్ చేయడానికి కొన్ని పద్దతులు పాటించాలి. ఇంట్లో ఫ్రిజ్‌ పక్కగా ఒక బోర్డును ఉంచి, దాని మీద ఆ వారంలో మీరు వండేబోయే ఆహార పదార్ధాలను రాసేయండి. దీంతో ఎలాంటి కన్ఫూజన్ లేకుండా ఏ రోజుకా రోజు వంట సులభంగా చేసుకోవచ్చు . అలాగే ఫ్రిజ్‌కి మరో వైపు మిగిలిపోయిన పదార్థాల వివరాలు రాసేయండి. ఇలా చేయడం వల్ల ఫ్రిజ్‌లో ఏమి ఉన్నాయి అనేది ఇంట్లో ఉన్న వాళ్ళందరికి తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల ఆహార పదార్థాల వ థా కావు. కొన్ని పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టి అలానే మరిచిపోతారు. తర్వాత వాటిని పడైపోయిన తర్వాత బయపడేస్తుంటారు. ఇలా పారేయకుండా ఉండాలంటే ఆ తెచ్చుకున్న పదార్థాల మీద వెంటనే మీరు తెచ్చిన తేదీని వేయాలి. దీని వల్ల అది ఎంత కాలం నుంచి నిల్వ ఉంటుందో తెలుస్తుంది.

మైక్రోవేవ్‌ గోడలకు, సీలింగ్‌కు అతుక్కుపోయి, ఎండిపోయిన ఆహారపదార్థాలు. అక్కడే ఉంటాయి. వాటిని శుభ్రం చేయాలంటే తడిపిన స్పాంజ్‌ను మైక్రోవేవ్‌లో ఉంచి ఐదు నిమిషాలు వేడిచేయాలి. ఆవిరి మైక్రోవేవ్‌ గోడలకు అతుక్కుపోయిన పదార్థాలను వదులవుతాయి. ఆ తరువాత ఆ స్పాంజ్‌తోనే వాటిని తుడిస్తే చాలు.

స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ గిన్నెల మీద మరకలను కొన్ని పద్దతుల ద్వారా క్షణాల్లో మాయం చేయవచ్చు. వంటింట్లోని స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ గిన్నెలు, వస్తువులు కొత్తగా మెరిసిపోవాలంటే బేబీ లేదా ఆలివ్‌ నూనెల్ని వాడాలి. తర్వాత మెత్తటి బట్టను నూనెలో ముంచి వాటి మీద ఉన్న మరకల మీద రుద్దితే తొలిగిపోయి గిన్నెలు కొత్తగా మెరిసిపోతాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories