బంధాలు...అనుబంధాలు...అన్నీ ఆర్థిక సంబంధాలే!

బంధాలు...అనుబంధాలు...అన్నీ ఆర్థిక సంబంధాలే!
x
Highlights

రోజులు మారుతున్న కొద్ది మనిషి లైప్ స్టైల్ కూడా మారుతోంది. మనుషుల ప్రవర్తనలో చాలా మార్పులు వస్తున్నాయి. అప్పట్లో మన చుట్టూ ఉన్న వారిలో ఎవరికైనా, ఏదైనా...

రోజులు మారుతున్న కొద్ది మనిషి లైప్ స్టైల్ కూడా మారుతోంది. మనుషుల ప్రవర్తనలో చాలా మార్పులు వస్తున్నాయి. అప్పట్లో మన చుట్టూ ఉన్న వారిలో ఎవరికైనా, ఏదైనా కష్టం వస్తే దానిని తీర్చడానికి అందరూ కలిసి తమవంతుగా సహాయం చేసేవారు . అప్పటి మనుషులు మనము, మనది అనే భావన ఎక్కువగా ఉంటుంది. అలాగే స్త్రీలను గౌరవించడం, వారి దగ్గర ధనం ఉన్నప్పటికీ, అది కేవలం బ్రతకడం కోసమే అని భావించేవారు. అయితే రానురాను నెలలు కాలం మారుతున్న కొద్ది మనుషుల్లో మార్పులు వస్తున్నాయి.

ఈ కాల గమనంలో మనిషి తన మేధస్సుకు పదునుపెట్టి నూతన ఆవిష్కరణలు కనుగొంటున్నాడు. ఆ కాలంతో పోలిస్తే ఇప్పుడు కష్టమైన పని అనేది ఏ ఒక్కటి కూడా లేదు, ఎంతటి కష్టతరమైన పని అయినా సరే దానిని డబ్బుతో సులువుగా కానిచ్చేస్తున్నారు. నాటి రోజుల్లో మన చుట్టూ ఉన్నవారు ఎవరైనా చనిపోతే, వారి కుటుంబాన్ని అందురూ ఎంతో ఓదార్చి, తమవంతు సాయాన్ని అందించి వారికి బాసటగా నిలిచేవారు. నేటి పరిస్థితి అలా లేదు.

ఎవరికైనా ఆర్ధికంగా సమస్యలు వస్తే వారికి అదుకోవడంలో చాలా మంది సంకోచిస్తున్నారు. వారు ఎదురుపడితే మనల్ని ఎక్కడ డబ్బులు అడుగుతారో అనే బావన చాలా మందిలో ఉంలుంది. దైర్యం చేసి కొందరు తమ పరిస్థితి మరింత క్షీణించి మనల్ని డబ్బులు అడిగినా మనలో చాలా ఉండి కూడా లేదని చెప్తుంటాం. ప్రస్తుత కాలంలో నడుస్తన్నది. అందరికి డబ్బు సంపాదనే ప్రధాన ధ్యేయంగా మారింది. అంత డబ్బే ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లడం, సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరుకొని, హాయిగా భార్య బిడ్డలతో గడపడం.మన ఫ్యామీలి అనే భావన చాలా మంది నాటుకుపోయింది. సమాజం ఎటుపోతే మనకు ఏంటి ఆలోచన ఇప్పుడు ఉన్న సమాజనిది. చివరకు మనం ఎటువంటి స్థితికి వచ్చామంటే, చివరకు మన ప్రాణ స్నేహితుడు, తల్లి, తండ్రి, అక్క, అన్న, చెల్లి ఎవరైనా అవసరం అని డబ్బు అడిగితే, వారికి ఇవ్వడం ఎందుకు, అదేదో మన సోంత పనులకు ఉపయోగించుకుంటే సరిపోతుంది కదా అనే నీచమైన అబద్దాలు చెప్పే స్థితికి వచ్చాం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories