గోల్ఫ్‌ హై క్లాసు వాళ్లు ఆడే ఆట కాదు..!

గోల్ఫ్‌  హై క్లాసు వాళ్లు ఆడే ఆట కాదు..!
x
Highlights

గోల్ఫ్‌ అంటే ఇదే కేవలం హై క్లాసు వారికి మాత్రమే పరిమితమైన గేమ్‌గా చాలమంది భావిస్తారు. కానీ అది నిజం కాదు.. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ఎంతోమంది...

గోల్ఫ్‌ అంటే ఇదే కేవలం హై క్లాసు వారికి మాత్రమే పరిమితమైన గేమ్‌గా చాలమంది భావిస్తారు. కానీ అది నిజం కాదు.. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ఎంతోమంది క్రీడాకారులు ఈ గోల్ఫ్ లో విజయం సాధించారు. ఇంతకీ గోల్ఫ్ ని ఎలా ఆడతారంటే.. ఒక బంతి, వంపుగల చేతకర్రతో ఆడతారు. ఈ గేమ్ మైదానం చాల పెద్దగా ఉంటుంది.

గోల్ఫ్‌ గేమ్ 14వ శతాబ్దంలో స్కాట్లాండ్‌లో మొదలయింది. అక్కడ నుంచి మెల్లమెల్లగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ ఆటలో బంతిని వరుసగా కొన్ని గుంటలో పడేలా కొట్టాలి. ఎవరైతే తక్కువ సార్లు బంతిని స్టిక్‌తో కొట్టి గుంటలలో పడేలా చేస్తారో.. ఆ వ్యక్తికి ఎక్కువ మార్కులు వస్తాయి.

గోల్ఫ్‌లో వాడే బంతిని రబ్బరుతో తయారు చేస్తారు. ఈ బంతి వ్యాసం ఒకో దేశంలో ఒకోలా ఉంటుంది. అమెరికాలో ఈ బంతి వ్యాసం 1.68 అంగుళాలు ఉంటే.. బ్రిటన్‌లో 1.62 అంగుళాలు ఉంటుంది. అయితే దీని బరువు మాత్రం 46 గ్రాములు ఉంటుంది. ఈ గేమ్‌లో ఉపయోగించే స్టిక్ కొంచెం బెండ్ అయినట్టు ఉంటుంది. ఈ స్టిక్‌నే క్లబ్‌ అంటారు. గేమ్‌లో 14 క్లబ్‌లు గల సెట్‌ ఉంటుంది. అవసరాన్ని బట్టి క్రీడాకారులు ఆయా స్టిక్‌లను వాడతారు. ఒక సెట్‌లో ఉండే 14 క్లబ్‌లు ఏ మాత్రం సమానంగా ఉండవు. వీటిలో కొన్నిటిని లోహంతో తయారు చేస్తే.. మరికొన్నిటిని చెక్కతో తయారు చేస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories