గడ్డ కట్టని నీరు ఉండేది అక్కడే!

గడ్డ కట్టని నీరు ఉండేది అక్కడే!
x
Highlights

ప్రపంచంలోని స‌ర‌స్సుల్లో లోతైన.. అతిపెద్ద మంచినీటి స‌ర‌స్సుల్లో లేక్ బైకాల్ ఒకటి. ఈ సరస్సు రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉంది. చంద్రవంక ఆకారంలో ఉండే ఈ...

ప్రపంచంలోని స‌ర‌స్సుల్లో లోతైన.. అతిపెద్ద మంచినీటి స‌ర‌స్సుల్లో లేక్ బైకాల్ ఒకటి. ఈ సరస్సు రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉంది. చంద్రవంక ఆకారంలో ఉండే ఈ అందమైన సరస్సును పర్ల్‌ ఆఫ్‌ రష్యా అని పిలుస్తారు. ఎత్తయిన పర్వతాలు, కొండల మధ్య ఇంచుమించు 636 కిలోమీటర్ల పొడవు, 20 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. 5,387 అడుగుల లోతు ఉంటుంది. ప్రపంచంలో గడ్డ కట్టని మంచినీటిలో 20 శాతం నీరు ఈ సరస్సులోనే ఉంటుంది. బైకాల్‌ సరస్సులో ఇంచుమించు 30 వరకూ దీవులు ఉంటాయి.

బైకాల్‌ సరస్సులోని నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అందుకే దీనికి 'క్లియరెస్ట్‌ లేక్‌'గా పిలుస్తారు. పై నుంచి చూస్తే 130 అడుగుల లోతువరకూ భలేగా పారదర్శకంగా కనిపిస్తాయి. ఈ సరస్సు మీదుగా ఇంచుమించు 300కి పైగా ప్రవాహాలు, నదులు ప్రవహిస్తుంటాయి. ఈ సరస్సు లోతుల్లోనూ ఆక్సిజన్‌ శాతం ఎక్కువేనట. అందుకే అప్పట్లో రకరకాల రోగాల్ని తగ్గించుకోవడానికి ఈ నీటిలో స్నానాలు చేసేవారు.

చలికాలంలో ఈ సరస్సు దాదాపు గడ్డకట్టుకుపోతుంది. ఆ సమయంలో అద్భుతమైన ఫినామినా ఏర్పడుతుంది. మంచు గడ్డలే తళతళ మెరుస్తూ కనిపిస్తుంటాయి. దీన్ని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు వస్తుంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories