కప్పు కాఫీ కోసం భూమికి 750 అడుగుల లోతుకు వెళ్లారట!

కప్పు కాఫీ కోసం భూమికి 750 అడుగుల లోతుకు వెళ్లారట!
x
Highlights

కాఫీ కోసం అంత లోతుకు ఎందుకు.. ప్రక్కన ఉన్న హోటల్ కి వెళ్లితే సరిపోతుందిగా అని ఆలోచిస్తున్నారా.. అంత లోతులో కాఫీ తాగితే వచ్చే మజానే వేరంటున్నారు ...

కాఫీ కోసం అంత లోతుకు ఎందుకు.. ప్రక్కన ఉన్న హోటల్ కి వెళ్లితే సరిపోతుందిగా అని ఆలోచిస్తున్నారా.. అంత లోతులో కాఫీ తాగితే వచ్చే మజానే వేరంటున్నారు పర్యటకులు. భూమికి 750 అడుగుల లోతులో.. చుట్టూ గుహలు.. ఓ కమ్మని కాఫీ.. ఆహా భలే రుచిని ఆస్వాదించొచ్చు. బోరు కొడితే షాపింగ్ కూడా చేసేయొచ్చు. ఇంతకీ అదెక్కడ అనుకుంటున్నారా.. అమెరికాలోని న్యూమెక్సికో రాష్ట్రంలో ఓ జాతీయ పార్కుంది. పేరు కాల్స్‌బేడ్‌ కేవెర్న్‌స్‌ నేషనల్‌ పార్క్‌. అక్కడి గ్వాడల్ప్‌ పర్వతాల్లో.. ఓ కప్పు కాఫీ కోసమే అక్కడికి పర్యటకులు వెళుతుండటం విశేషం.

ఈ పార్కులో బోలెడు గుహలున్నాయి. మొత్తం 118 సున్నపు రాతి గుహలు వరుసగా వందలాది మైళ్లు విస్తరించి ఉన్నాయి. అది కూడా భూమి లోపలికి ఓ సొరంగంలా. ప్రవేశ గుహ ద్వారం నుంచే తారు రోడ్డు ఉంటుంది. దానిపై నడుస్తూ లోపలికెళ్లగానే లోపల కొన్ని గుహ ఛాంబర్లు కనిపిస్తాయి. వాటిని చూసుకుంటూ కాస్త ముందుకెళితే అక్కడో లిఫ్టు ఉంటుంది. ఆ లిఫ్టు పర్యాటకులని భూమి లోతుకి తీసుకెళుతుంది. ఇంతకీ లోతంత తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఒకటి కాదు రెండు ఏకంగా భూమికి 750 అడుగుల లోతుకు తీసుకెళ్లిపోతుంది.

అక్కడే కిలోమీటరున్నరకు పైగా పొడవున్న ఓ పేద్ద గుహ కనిపిస్తుంది. అక్కడ విద్యుత్‌ బల్బుల వెలుగుల్లో మెరిసిపోతూ ఓ కెఫెటేరియా కనిపిస్తుంది. కమ్మని కాఫీలు, పిజ్జాల్లాంటివి అక్కడ కూర్చుని ఎంచక్కా తినొచ్చు. అక్కడున్న మరో స్టాల్‌లో షాపింగ్ కూడా చేయచ్చు. అంత లోతులో కాఫీ తాగామనీ పర్యాటకులు గొప్పగా చెప్పుకోవటం మరో విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories