Banana: అన్ని కాలాల్లోనూ దొరికే అరటిపండుతో ఇన్ని లాభాలా? తెలిస్తే రోజూ తినడం పక్కా!

Banana: అన్ని కాలాల్లోనూ దొరికే అరటిపండుతో ఇన్ని లాభాలా? తెలిస్తే రోజూ తినడం పక్కా!
x

Banana: అన్ని కాలాల్లోనూ దొరికే అరటిపండుతో ఇన్ని లాభాలా? తెలిస్తే రోజూ తినడం పక్కా!

Highlights

Banana : అరటిపండు.. మనకు నిత్యం అందుబాటులో ఉండే ఒక అద్భుతమైన పండు. ఇది కేవలం రుచికరమైనదే కాదు, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Banana : అరటిపండు.. మనకు నిత్యం అందుబాటులో ఉండే ఒక అద్భుతమైన పండు. ఇది కేవలం రుచికరమైనదే కాదు, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని రోజూ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో, ఎందుకు దీన్ని తప్పకుండా తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు.

పోషకాల గని

అరటిపండును అందరూ సులభంగా కొనుగోలు చేయగలిగే ఒక అద్భుతమైన పండు. ధనికుడైనా, పేదవాడైనా అరటిపండును తిననివారు ఉండరు. ఏడాది పొడవునా లభించే ఈ పండులో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ బి6, విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి.

రక్తపోటు నియంత్రణ, గుండెకు రక్షణ

అరటిపండులో అధికంగా ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో చాలా సహాయపడుతుంది. ఇది శరీరంలోని సోడియం స్థాయిలను నియంత్రించి, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యానికి పొటాషియం ఎంతో అవసరం, అందుకే ప్రతిరోజు ఒక అరటిపండు తినడం మంచిది.

జ్ఞాపకశక్తిని పెంచుతుంది

అరటిపండు కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అంతేకాకుండా, ఇందులో ఉండే పోషకాలు జ్ఞాపకశక్తిని పెంచి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అరటిపండును తప్పకుండా తినాలి.

జీర్ణశక్తి, మూత్రపిండాల ఆరోగ్యం

అరటిపండులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా పచ్చి అరటిపండ్లలో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్, గట్‌లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది. ఇది అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే, ఈ పండు మూత్రపిండాల సంబంధిత సమస్యలు రాకుండా నిరోధించడంలో కూడా సహాయపడుతుంది.

శారీరక శ్రమకు తక్షణ శక్తి

శారీరక శ్రమ లేదా వ్యాయామం తర్వాత అలసటగా అనిపిస్తే, ఒక అరటిపండు తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో ఉండే సహజ చక్కెరలు శరీరానికి కావాల్సిన ఎనర్జీని వెంటనే అందిస్తాయి. అందుకే చాలామంది వ్యాయామం చేసేవారు దీనిని తినడానికి ఇష్టపడతారు. అరటిపండు రుచికరంగా ఉండటమే కాకుండా, చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది.

అరటిపండుతో ఆహార పదార్థాలు

కేవలం పండుగానే కాకుండా, అరటిపండును అనేక రకాలుగా తీసుకోవచ్చు. మిల్క్ షేక్, స్మూతీలు, సలాడ్‌లలో దీనిని చేర్చుకోవచ్చు. అదనంగా, ఇది స్వీట్లు, కేకులు తయారు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే, కొన్ని అలెర్జీలు, సైనస్ లేదా ఉబ్బరం సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు అరటిపండును తినడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories