దంతాలు మిళమిళ మెరవాలంటే వాటికి దూరంగా ఉండాలి..

దంతాలు మిళమిళ మెరవాలంటే వాటికి దూరంగా ఉండాలి..
x
Highlights

చిరునవ్వు.. ఎదుటివారిని ఆకట్టుకోవాలంటే మనం చిరునవ్వు చిందిస్తే సరిపోతుంది. అలాంటి నవ్వు అందంగా ఉండాలంటే దంతాలు కూడా అందంగా, తెల్లగా మెరవాలి. కానీ,...

చిరునవ్వు.. ఎదుటివారిని ఆకట్టుకోవాలంటే మనం చిరునవ్వు చిందిస్తే సరిపోతుంది. అలాంటి నవ్వు అందంగా ఉండాలంటే దంతాలు కూడా అందంగా, తెల్లగా మెరవాలి. కానీ, చాలామందికి అనేక కారణాలతో దంతాలు పసుపు రంగులో ఉంటాయి. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే డెంటిస్టుల దగ్గరికే వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంట్లోని కొన్ని చిట్కాల ద్వారా కూడా సమస్యనుపరిష్కారం చేసుకోవచ్చు.

సహజపద్దతులో మీ దంతాలు మిళమిళ మెరవాలంటే..ముందుగా కాఫీ, సోడా, మౌత్ వాష్ లకు దూరంగా ఉండాలి .

రోజుకు కనీసం రెండు సార్లు బ్రష్ చేయాలి . కొన్ని సార్లు ఆతురతతో ఉన్నప్పుడు సరిగా బ్రష్ చేయరు. అటువంటప్పుడు మీరు ఫైవర్ అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మీ దంతాలు నేచులర్ గా శుభ్రపడుతాయి. అలాగే సిట్రస్ పండ్లు నేచురల్ గా దంతాల మీద ఎటువంటి మరకలు లేకుండా శుభ్రం చేస్తాయి. విటమిన్ సి ఉన్న స్ట్రాబెర్రీ, కివి పండ్లు మీ దంతాలను బలోపేతం చేస్తాయి. పాల ఉత్పత్తులు, పెరుగు దంతక్షయ వ్యాధి తగ్గిస్తాయి మరియు దంతాల యొక్క స్వచ్ఛతను కాపాడుతాయి. జున్ను పళ్ళను శుధ్దిచేసి, అత్యంత సమర్థవంతంగా మరియు తెల్లగా మార్చుతాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు నమలడం వల్ల చెడు శ్వాసను నివారిస్తుంది మరియు దంతాల మీద ఎటువంటి మరకలు పడకుండా రక్షణ కల్పిస్తుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ బ్రోకోలీ, క్యారెట్, గుమ్మడి వంటి వాటిలో విటమిన్ కె సమృద్ధిగా ఉంది, ఇది పళ్ళు ఎనామెల్ యొక్క నిర్మాణంకు సహాయపడుతుంది. అలాగే పళ్ళ మద్యలో శుభ్రం చేయడంతో పాటు దంతాలను తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది. నిమ్మ , ఉప్పు మిశ్రమం సహజంగానే దంతాలు తళతళలాడేలా చేస్తాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories