పిల్లలకు విలువలు నేర్పాలి!

పిల్లలకు విలువలు నేర్పాలి!
x
Highlights

చిన్న వయస్సు నుంచే పిల్లలకు సంస్కారం తోపాటు కొన్నిరకాల విలువల్ని నేర్పాలి. ఐదేళ్ల లోపు పిల్లలకు చెప్పే మాటలు విత్తనాళ్లా నాటుకు పోతాయి. సాధారణంగా...

చిన్న వయస్సు నుంచే పిల్లలకు సంస్కారం తోపాటు కొన్నిరకాల విలువల్ని నేర్పాలి. ఐదేళ్ల లోపు పిల్లలకు చెప్పే మాటలు విత్తనాళ్లా నాటుకు పోతాయి. సాధారణంగా పిల్లలను తల్లిదండ్రులు గారాబంగా చేస్తుంటారు. ఇది వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుంది. మరింత మొండిగా, మాట వినకుండా తయారు చేస్తుంది. వారికి ఏదైనా అవసరం లేదని భావిస్తే వాటిని కొనటం లేదా బహుమతిగా ఇవ్వటం వంటివి చేయకండి. పిల్లలు కోరిన దానికి మీరు వెంటనే అంగీకరించవద్దు. పిల్లలకు అన్ని తేలికగా ఇవ్వడం ద్వారా వారికి వాటి వెనుకగల కష్టం తెలియదు. అలాగే కొంతమంది తల్లితండ్రులు పిల్లలను అతి జాగ్రత్తతో పెంచుతారు. ఈ కారణంగా పిల్లల మనుస్సులో ఏముందో తెలుసుకోలేరు. అతిగా గారాబం కూడా చేయవద్దు. ఈ గారభం వల్ల వారు ఇతరులను అవమానపరచే స్థాయికి కూడా ఎదుగుతారు. ఇది తల్లితండ్రులకు సమస్య అయ్యే ప్రమాదం వుంది. కనుక వారికి ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంచాలి.

ఇతరులతో ఎలా మెలగాలో కూడా చెప్పాలి. ఎటువంటి పనులు చేయకూడదో వివరించాలి. అలా చేయడం వల్ల పిల్లలకి మంచి ప్రవర్తన అలవడతుంది. ఏది తప్పు, ఏది ఒప్పో తెలుసుకునే విచక్షణా జ్ఞానం పెరుగుతుంది. తోటిపిల్లలను చులకన చేస్తూ మాట్లాడకుండా అవసరమైతే ఆ సమయంలో వాళ్లకు సహాయం చేయమని ప్రోత్సహించాలి.అదేవిధంగా ఏదైనా పనిని నిర్ణీత సమయంలో పూర్తిచేసేట్టుగా పిల్లల్ని ప్రోత్సహించాలి. ఉద్యోగస్తులైన తల్లిదండ్రులు వారి పిల్లలకు ప్రేమను బహుమతి రూపంలో ఇస్తారు. అలాచేయ కుండా వారితో కలసి గడపడం, వారి అవ సరాలు, కష్టాలు తెలుసుకోవడం, తగిన పరిష్కారాన్ని సూచించడం వంటివి చేయాలి. అపుడే వారు సమాజాన్ని అర్థం చేసుకోగలరు. క్రమశిక్షణ వల్ల కలిగే లాభం గురించి వివరిస్తే వాళ్ళే తరువాత నుంచి సమయానికి పనులు చేయడం అలవాటు చేసుకుంటారు. అన్నింటికన్నా ముందు పిల్లలకు నిజాయితీని నేర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ పిల్లలు భవిష్యత్‌లో మంచి అడుగుల్లో నడుస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories