Tattoo: స్టైల్‌గా కనిపించే టాటూల వెనకాల ఇంత ప్రమాదం దాగి ఉందా.?

Tattoo Trend Alert: Hidden Health Risks of Getting Inked
x

Tattoo: స్టైల్‌గా కనిపించే టాటూల వెనకాల ఇంత ప్రమాదం దాగి ఉందా.?

Highlights

Tattoo: టాటూ.. ఇటీవల ఈ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోతోంది. సినిమాల ప్రభావమో మరే కారణమో కానీ చాలా మంది టాటూలను వేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Tattoo: టాటూ.. ఇటీవల ఈ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోతోంది. సినిమాల ప్రభావమో మరే కారణమో కానీ చాలా మంది టాటూలను వేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు కేవలం పట్టణాలకే పరిమితమైన ఈ ట్రెండ్‌ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ పెరిగిపోతోంది. దీంతో చిన్న చిన్న పట్టణాల్లోకూడా టాటూ సెంటర్స్‌ వెలుస్తున్నాయి. అయితే చూడ్డానికి అందంగా, స్టైల్‌గా కనిపించే టాటూల వెనకాల పెద్ద ప్రమాదం దాగి ఉందని అంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా టాటూల కోసం ఉపయోగించే సిరా అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు, టాటూల వల్ల హెచ్ఐవి, హైపటైటిస్, చర్మ క్యాన్సర్ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందని తెలిపారు. టాటూ పార్లర్లను నియంత్రించే చట్టం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. టాటూలకు ఉపయోగించే సిరాలో రసాయనాలు ఉండటంతో, చర్మ సమస్యలు, అలెర్జీలు కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇక ఒకరికి ఉపయోగించిన సిరంజిలను మరొకరికి ఉపయోగించడం వల్ల ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. అందుకే టాటూల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సెలబ్రిటీలను చూసి ట్రెండ్‌ ఫాలో అయ్యే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. టాటూ కోసం ఉపయోగిస్తున్న సిరాలో ఎలాంటి కెమికల్స్‌ ఉన్నాయి.? అది శరీరంపై ఏమేర ప్రభావం చూపుతుంది లాంటి విషయాలను తెలుసుకోవాలి. అలాగే నాణ్యత, శుభ్రత పాటించే పార్లర్లలో మాత్రమే టాటూలను వేయించుకోవాలని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories