Womens Health: మహిళలకి అలర్ట్‌.. పీరియడ్స్‌ సమయంలో ఈ ఆహారాలు దివ్యవౌషధం..!

Taking These Foods During Periods Relieves Pain
x

మహిళలకి అలర్ట్‌.. పీరియడ్స్‌ సమయంలో ఈ ఆహారాలు దివ్యవౌషధం..!

Highlights

* రియడ్స్‌ సమయంలో డైట్‌లో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి.

Womens Health: చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో తిమ్మిర్లు, నొప్పులని ఎదుర్కొంటారు. వీటి నుంచి ఉపశమనం పొందడానికి అనేక హోం రెమిడిస్‌, మందులు తీసుకుంటారు. పీరియడ్స్‌ సమయంలో ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. డైట్‌లో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

చాక్లెట్

చాక్లెట్‌ తినడానికి రుచిగా ఉంటుంది. ఇందులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది కండరాలను సడలించడంలో సహాయపడుతుంది. చాక్లెట్ శరీరంలో డోపమైన్ స్థాయిని పెంచుతుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 70 శాతం కోకో పౌడర్ ఉన్న చాక్లెట్ పీరియడ్స్ సమయంలో ఉత్తమంగా పరిగణిస్తారు.

అల్లం

పీరియడ్స్ సమయంలో నొప్పితో పాటు అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ పరిస్థితిలో అల్లం వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది నొప్పిని తగ్గిస్తుంది. వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

పసుపు

పీరియడ్స్ సమయంలో పసుపును ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. అల్లం పీరియడ్స్ నొప్పులని , ఉబ్బరం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

పచ్చని ఆకు కూరలు

పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే డైట్‌లో ఆకుకూరలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. వీటిలో ఐరన్, ఫైబర్ ఉండటంతో పాటు ప్రయోజనకరమైన ఫైటోకెమికల్స్ వాపును తగ్గించడంలో పనిచేస్తాయి. వీటిని ప్రతి ఒక్కరూ ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories