Tea And Coffee: టీ, కాఫీ తాగడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందా ?

Tea And Coffee
x

Tea And Coffee: టీ, కాఫీ తాగడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందా ?

Highlights

Tea And Coffee: టీ, కాఫీ రెండింటినీ ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. ఇవి లేకపోతే కొంతమందికి డే కూడా స్టార్ట్ కాదు. నిద్రలేచిన వెంటనే కచ్చితంగా టీ లేదా కాఫీ ఉండాల్సిందే.

Tea And Coffee: టీ, కాఫీ రెండింటినీ ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. ఇవి లేకపోతే కొంతమందికి డే కూడా స్టార్ట్ కాదు. నిద్రలేచిన వెంటనే కచ్చితంగా టీ లేదా కాఫీ ఉండాల్సిందే. కొంతమంది వాటిని ఇష్టపడతే, మరికొందరు వాటికి బానిసలవుతారు. మీ చుట్టూ చాలా మంది కాఫీ ప్రియులను మీరు చూసి ఉంటారు. ప్రతి అరగంటకు టీ లేదా కాఫీ తాగుతుంటారు. అయితే.. టీ, కాఫీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతున్నారు. టీ, కాఫీ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతారు. అయితే, కొంత మంది మాత్రం టీ, కాఫీ తాగడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని అంటారు. కాబట్టి, ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

హానికరం

టీ, కాఫీలలో కెఫిన్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. టీలోని ఎల్-థీన్ విశ్రాంతి అనుభూతిని ఇస్తుంది. అయితే, కాఫీలో కెఫిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. ఈ రెండు పానీయాలు కూడా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. రెండు పదార్థాలు మానసిక ఒత్తిడికి ఉపశమనం కలిగిస్తాయి. కానీ వాటిని అధికంగా తీసుకుంటే హానికరమని నిపుణులు చెబుతున్నారు.

తక్కువ పరిమాణం

మీకు కడుపు సంబంధిత సమస్యలు లేకపోతే మీరు రోజుకు రెండు నుండి మూడు సార్లు టీ లేదా కాఫీ తాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మీకు గ్యాస్, అసిడిటీ, అజీర్ణం లేదా మలబద్ధకం వంటి సమస్యలు ఉంటే వాటిని అధికంగా తీసుకోవడం వల్ల మీకు హాని కలుగుతుందని అంటున్నారు. అందువల్ల, వాటిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. మీరు పనుల వల్ల ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటే టీ, కాఫీలకు బదులుగా మీరు సహజ పానీయాలను తీసుకోవచ్చు.

టీ, కాఫీ ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాలు

టీ, కాఫీ ఎక్కువగా తాగడం వల్ల కెఫిన్ మోతాదు పెరిగి ఆందోళన, తలనొప్పి, జీర్ణ సమస్యలు, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా, మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories