ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా?

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా?
x
Highlights

ఆన్‌లైన్‌ షాపింగ్‌లో చాలామంది చేదు అనుభవాలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా దుస్తులు, పాదరక్షల విషయంలో ఆన్‌లైన్‌ షాపర్స్‌కు చాలా సార్లు బాడ్ ఎక్స్పీరియన్స్...

ఆన్‌లైన్‌ షాపింగ్‌లో చాలామంది చేదు అనుభవాలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా దుస్తులు, పాదరక్షల విషయంలో ఆన్‌లైన్‌ షాపర్స్‌కు చాలా సార్లు బాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాస్త ప్రిపేరుడ్ ఉంటే ఇలాంటి ఇబ్బందులను అధిగమించి సులువుగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయవచ్చు.

ఆన్‌లైన్‌లో దుస్తులు కొనేటప్పుడు ఆర్డర్‌ ఇచ్చింది, ఒకటయితే, తీరా చేతికొచ్చేది మరో ఒక్కటి. దీనికి ముఖ్య కారణం ల్యాప్‌టాప్‌ లేదా మొబైల్‌ స్ర్కీన్‌లో చూసినప్పుడు ఆ దుస్తులు నిజమైన రంగుకు భిన్నంగా కనిపించటమే. మీకు నచ్చిన దానిని ఎంచుకోవాలనుకుంటే ముందు దుస్తుల రంగుల గురించి కొంత అవగాహన ఉండాలి. కొన్ని దుస్తులు ఒరిజినల్‌గా చూసిన దానికి భిన్నంగా ఫోటోల్లో కనిపిస్తాయి. లైట్ కలర్స్‌ దుస్తులు ఫోటోల్లో డల్‌గా కనిపిస్తాయి. కాంతిమంతంగా ఉండేవి ఫోటోల్లో మరింత కాంతిమంతంగా కనిపిస్తాయి. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.

దుస్తులు, పాదరక్షలను ఆర్డర్‌ చేసేముందు కొలతలను సరి చూసుకోవాలి. అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోవాలి. మనకున్న కొలతల ప్రకారం మన ఆర్డర్‌ను రివ్యూ చేసుకోవాలి. చాలాసార్లు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారు సైజ్‌చార్ట్‌లను పట్టించుకోరు. అన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో కొలతల ప్రమాణాలు ఒకేలా ఉండవు. కావున చాలా జాగ్రత్తగా సైజ్‌చార్ట్స్‌లోకి వెళ్లి కొలతలు మళ్లీ ఒక్కసారి చూసుకోవాలి.

బ్రాండ్‌ను బట్టి కూడా సైజ్‌లు ఉంటాయి చాలా బ్రాండ్‌లకు వాటి స్వంత సైజ్‌ చార్ట్‌లు ఉంటాయి. కొలతలు ఉన్న నోట్‌ను దగ్గర ఉంచుకోవాలి. మీ శరీర కొలతలు మీరు కొనాలనుకున్న బ్రాండ్‌ మ్యాచ్‌ అయ్యేలా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆన్‌లైన్‌లో కొన్నా దుస్తులు సెట్ అవుతాయి. మీకు డెలివరైనా వస్తువు నచ్చకపోతే దాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేయండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories