Breast Cancer: బ్రెస్ట్‌ క్యాన్సర్‌ తిరగబెడుతుందా? ప్రముఖ నటుడి భార్య ఎమోషనల్‌ పోస్ట్

Breast Cancer
x

Breast Cancer: బ్రెస్ట్‌ క్యాన్సర్‌ తిరగబెడుతుందా? ప్రముఖ నటుడి భార్య ఎమోషనల్‌ పోస్ట్

Highlights

Breast Cancer: గతంలో ఎంత ధైర్యంగా క్యాన్సర్‌ను బీట్ చేశారో.. ఇప్పుడు కూడా అదే ధైర్యంతో, అదే పట్టుదలతో మరోసారి క్యాన్సర్‌ను జయించాలని చూస్తున్నారు.

Breast Cancer: భారత్‌లో ప్రతి 4 నిమిషాలకు ఒక మహిళ బ్రెస్ట్ కాన్సర్‌ బారిన పడుతున్నారు...! ప్రతి ఏడాది లక్షల మంది ఈ బాధను అనుభవిస్తున్నారు. అందులో కొందరు జీవితాలు కోల్పోతున్నారు.. ఇంకొందరు జీవితంతో పోరాడుతున్నారు. కాలం గడుస్తున్న ప్రతి క్షణంలో జరుగుతున్న అసలైన యుద్ధమిది. క్యాన్సర్‌ను ఒకసారి జయించడమే కష్టం.. అందుకు ఎడతెగని పోరాటం అవసరం..! అంతటి కష్టసమాయాన్ని ఛేదించిన తర్వాత కూడా మరోసారి అదే క్యాన్సర్‌ బారిన పడితే ఎంత నరకమో కదా..! అలాంటి బాధనే భరిస్తున్నారు తహిరా కశ్యప్‌. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ మళ్లీ వచ్చిందని ఆమె స్వయంగా ప్రకటించారు. సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్‌ మెసేజ్ పోస్ట్ చేశారు. ఆరోగ్యంపై అప్రమత్తత ఎంత అవసరమో, స్క్రీనింగ్‌తో ఎంత త్వరగా సమస్యను తెలుసుకోవచ్చో ఆమె వివరించారు. గతంలో కూడా తహిరా క్యాన్సర్‌తో ఓసారి క్యాన్సర్‌తో పోరాడారు. 2018లో ఆమె బ్రెస్ట్ క్యాన్సర్‌కు గురయ్యారు. ఆ సమయంలో దానికి సంబంధించిన చికిత్సలు, సర్జరీ, మాస్టెక్టమీ లాంటివి తీసుకున్నారు. ఎంతో ధైర్యంగా, మోటివేషన్‌తో తన మొదటి పోరాటాన్ని గెలిచారు. ఆ సమయంలో ఆమె ఎన్నో స్పీచ్‌లు, పోస్టులు, పుస్తకాల ద్వారా ఆ అనుభవాన్ని పంచుకున్నారు. ఎంతోమంది క్యాన్సర్ ఫైటర్స్‌కు ఆమె ఒక స్పూర్తిగా మారారు.

అయితే ఏడేళ్ల తరువాత మళ్లీ అదే వ్యాధి తిరిగి రావడం ఆమెకు కాస్త ఊహించని విషాదం. ఇది కేవలం ఫిజికల్‌గానే కాదు, మెంటల్‌గా కూడా ఒక పెద్ద ఛాలెంజ్‌. అయినా తహిరా మళ్లీ ఒక స్ఫూర్తితో ముందుకు అడుగేస్తున్నారు. గతంలో ఎంత ధైర్యంగా క్యాన్సర్‌ను బీట్ చేశారో.. ఇప్పుడు కూడా అదే ధైర్యంతో, అదే పట్టుదలతో మరోసారి క్యాన్సర్‌ను జయించాలని చూస్తున్నారు.

ఇక క్యాన్సర్ అనేది ఒకసారే వస్తుందనుకోవడం పొరపాటు. చికిత్స తర్వాత శరీరంలో కనిపించకపోయినా, కొన్ని క్యాన్సర్ కణాలు సూక్ష్మంగా ఎక్కడో దాగి ఉండే అవకాశం ఉంటుంది. వాటిని వైద్య పరీక్షలతో వెంటనే గుర్తించడం కష్టమే. చికిత్స చేసిన సమయంలో కొన్ని కణాలు యాక్టీవ్‌గా ఉండకపోవచ్చు. ఇలా కనిపించకుండా, గుర్తించకుండా మన శరీరంలో మళ్లీ ఎదిగే అవకాశం ఉండే క్యాన్సర్‌ని 'రికరెన్స్' అంటారు. ఇది కొన్ని నెలల తర్వాత రావచ్చు లేదా కొన్ని సంవత్సరాల తర్వాతా రావచ్చు. కాబట్టి క్యాన్సర్‌పై మొదటి విజయం తర్వాత కూడా అప్రమత్తతంగా ఉండాల్సిందే!

Show Full Article
Print Article
Next Story
More Stories