Science: ప్రకృతి బలానికి తలవంచిన టెక్నాలజీ – శాటిలైట్‌లపై సూర్యుడి దాడి

Suns attack on technology satellites that bowed to the forces of nature
x

 Science: ప్రకృతి బలానికి తలవంచిన టెక్నాలజీ – శాటిలైట్‌లపై సూర్యుడి దాడి

Highlights

Science: ఇదిగో... ఇప్పుడు మనం చెప్పబోయే విషయం నిజంగా ఆశ్చర్యపరిచే అంశం

Science: ఇదిగో... ఇప్పుడు మనం చెప్పబోయే విషయం నిజంగా ఆశ్చర్యపరిచే అంశం… టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళినా ప్రకృతి ముందు అది ఎంత బలహీనమో తెలుసుకునే సమయం ఇదే. ఎన్నో వేల కోట్ల ఖర్చుతో భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్‌లు, ఒక్కసారి సూర్యుడి కోపానికి గురైతే ఏం జరుగుతుందో తెలుసా..?

ఎలాన్ మస్క్ బిల్డప్ చేసిన స్టార్‌లింక్ శాటిలైట్‌లు… అవే ఇప్పుడు అసలు కారణం లేని విధంగా భూమి వైపు జారిపోతున్నాయట. ఇది ఎక్కడ మొదలైంది..? అసలు ఈ శాటిలైట్‌లు ఎందుకు ముందే పడి పోతున్నాయి..? మనకు ఏవైనా ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందా..?

ఇదంతా మొదలైంది 2020లో. అప్పటి నుంచి సూర్యుడి పనితీరు బాగా పెరిగింది. 2024 అక్టోబర్ నాటికి సూర్యుడి 11 సంవత్సరాల సైకిల్‌లో మాక్సిమం స్టేజ్‌కి చేరాడు. ఈ సమయంలో సూర్యుడి నుంచి బయటకు వస్తున్న మెగ్నటిక్ తుఫాన్లు భూమి వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దీని ప్రభావంతో వాతావరణం వేడెక్కి పైభాగం విస్తరించిపోతోంది.

ఈ వేడి వల్ల శాటిలైట్‌లు ఎక్కడో అంతరిక్షంలో కాదు… భూమికి దగ్గరగా ఉండే వాతావరణంలోకి వచ్చేస్తున్నాయి. దాంతో, వాటిపై డ్రాగ్ పెరిగిపోతుంది. అంటే.. గాలి ఒత్తిడితో శాటిలైట్‌లు వేగంగా తన స్పీడ్ కోల్పోయి భూమి వైపు జారిపోతున్నాయి. సాధారణంగా ఒక స్టార్‌లింక్ శాటిలైట్ దాదాపు 5 ఏళ్లు పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు సూర్య తుఫాన్ల ప్రభావంతో దాని జీవితం 10 నుంచి 12 రోజులు ముందుగానే ముగుస్తోంది.

ఇంకా ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే… శాటిలైట్‌లు ఇలా భూమికి దూసుకొస్తున్న వేగం సాధారణ రీఎంట్రీ కన్నా ఎక్కువగా ఉంటోంది. దీని వలన మిగిలిన శాటిలైట్ భాగాలు పూర్తిగా కాలిపోవాలి కానీ... కొన్నిసార్లు అవి పూర్తిగా కాలిపోకుండా భూమిని తాకే ప్రమాదం ఏర్పడుతోంది. నిజంగా 2024లో కెనడాలోని సస్కచువాన్ అనే ప్రాంతంలో ఒక ఫారంలో 5.5 పౌండ్ల బరువున్న స్టార్‌లింక్ శాటిలైట్ భాగం పడిపోయింది. అదృష్టవశాత్తూ అది ఎవరినీ గాయపరచలేదు కానీ… ఇది భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉందనే టెన్షన్.

ఇంకా ఒక పెద్ద సమస్య ఏమిటంటే… ఇవన్నీ ఒక ఎత్తయితే… భూమి చుట్టూ ఇప్పటికే వందల సంఖ్యలో శాటిలైట్‌లు తిరుగుతున్నాయి. స్పేస్ ట్రాఫిక్ అంటే అంతరిక్ష రవాణా కూడా ఇప్పుడు ట్రాఫిక్ జామ్‌కి గురవుతోంది.ఒకదానికొకటి ఢీకొట్టే ప్రమాదం ఎక్కువైపోతోంది. ఎందుకంటే.. ఇవి ముందుగా తయారుచేసిన మార్గాల్లో తిరుగుతుంటాయి. కానీ సౌర తుఫాన్లు కారణంగా అవి అనూహ్యంగా మారిపోయే అవకాశముంది. దాంతో శాటిలైట్‌లు ఒకదానికొకటి ఢీకొనే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి.

ఇప్పటికే 7500కి పైగా స్టార్‌లింక్ శాటిలైట్‌లు ఆకాశంలో ఉన్నాయి. ఇక స్పేస్ X టార్గెట్ ఏమిటంటే... వాటిని 42,000 దాకా పెంచేయడమే! అంటే వచ్చే రోజుల్లో ప్రతి వారం కాదు.. ప్రతిరోజూ ఒక్కో శాటిలైట్ రీఎంట్రీ జరగొచ్చు.

ఈ పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి… భవిష్యత్తులో అంతరిక్షం సేఫ్‌గా ఉందా..? మన మీద పడే శాటిలైట్ మలినాలు మన జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి..? అంతరిక్షం కూడా ఓ ట్రాఫిక్ రిస్క్ ఏరియాగా మారిపోతుందా..?

మన టెక్నాలజీ బలమైనదే కానీ.. సూర్యుడి తాకిడి ముందు అది కూడా తలవంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఇకపై మానవ జ్ఞానంతో పాటు… ప్రకృతి మీద అవగాహన పెరిగితే తప్ప భవిష్యత్తు అంతరిక్ష ప్రయాణం సురక్షితం కాదేమో!

Show Full Article
Print Article
Next Story
More Stories