Sun Flower Seeds: పొద్దు తిరుగుడు గింజల్లో పోషకాలు అధికం.. ఈ భయంకర వ్యాధికి దివ్యవౌషధం..!

Sun Flower seeds are Rich in Nutrients in this control cancer
x

Sun Flower Seeds: పొద్దు తిరుగుడు గింజల్లో పోషకాలు అధికం.. ఈ భయంకర వ్యాధికి దివ్యవౌషధం..!

Highlights

Sun Flower Seeds: పొద్దు తిరుగుడు గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి కావాల్సిన శక్తిని అందించి రోగనిరోధకతను పెంచుతాయి.

Sun Flower Seeds: పొద్దు తిరుగుడు గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి కావాల్సిన శక్తిని అందించి రోగనిరోధకతను పెంచుతాయి. ఫలితంగా మనిషి వ్యాధులకు దూరంగా ఉంటాడు. పొద్దు తిరుగుడు గింజల నూనె కూడా మంచిదే. మిగతా వాటితో పోల్చిచే చాలా బెటర్‌. కాకపోతే సహజ సిద్దంగా వాడుకోవాలి. ఈ రోజు పొద్దు తిరుగుడు గింజల ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

పొద్దు తిరుగుడు గింజల్లో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి థైరాయిడ్‌ గ్రంథిని సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. పొద్దు తిరుగుడు పలుకుల్లో విటమిన్‌ ఈ, ఫ్లేవనాయిడ్ల వంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ల నివారించడం లో తోడ్పడుతాయి. వీటిల్లోని లినోలిక్‌ ఆమ్లం క్యాన్సర్‌ నిరోధక కొవ్వు ఆమ్లంగా పనిచేస్తున్నట్టు పలు అధ్యయనాల్లో తేలింది. నువ్వులు, వేరుశెనగలు, అవిసె గింజలతో పోలిస్తే పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఈ ఆమ్లం మోతాదు ఎక్కువగా ఉంటుంది.

పొద్దుతిరుగుడు గింజల్లోని విటమిన్‌ ఈ క్యాన్సర్‌ నిరోధకంగానే కాదు, కణస్థాయిలో వాపు ప్రక్రియ తగ్గటానికి సాయం చేస్తుంది. గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్ల మోతాదులనూ తగ్గిస్తుంది. ఫైటోస్టెరాల్స్‌ అనే రసాయనాలు అదనపు కొవ్వును శరీరం గ్రహించుకోకుండా ఆపుతాయి. ఒక కప్పు పొద్దు తిరుగుడు గింజల్లో 24 మైక్రోగ్రాముల సెలీనియం, 150 మి.గ్రా మెగ్నీషియం, 0.5 మి.గ్రా పాంటోథెనిక్‌ ఆమ్లం లభిస్తాయి. ఇవి కండరాలు పట్టేయకుండా కాపాడుతాయి.

గమనిక: ఇక్కడ ఇస్తున్న సమాచారం వివిధ సందర్భాలలో నిపుణులు చెప్పిన విషయాల ఆధారంగా ఇవ్వడం జరుగుతోంది. సాధారణ పాఠకుల ఆసక్తి మేరకు ఇక్కడ వీటిని అందిస్తున్నాము. వీటిని ఆచరించే ముందు..సంబంధిత నిపుణుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నాం. ఇది కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే.

Show Full Article
Print Article
Next Story
More Stories