Summer Skin Care Tips: వేసవిలో స్కిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా?

Summer Skin Care Tips
x

స్కిన్ ప్రాబ్లమ్స్ టిప్స్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Summer Skin Care Tips: ఎండల నుండి చర్మాన్ని కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ యూస్ చేస్తుంటారు

Summer Skin Care Tips: చాలా మంది వేసవిలో స్కిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఎండలను చర్మాన్ని కాపాడుతోవడానికి సన్ స్రీన్ యూజ్ చేస్తుంటారు. మీరు లోషన్స్ వాడే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే మీరు మరింత సమస్యలు కొని తెచ్చుకుంటారు. స్కిన్ ని సరిగ్గా ప్రొటెక్ట్ చేసుకోకపోతే, స్కిన్ ట్యాన్ మాత్రమే కాదు ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. స్నానం చేశాక సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి, ఫేస్ మాత్రమే కాదు ఎండకి ఎక్స్‌పోజ్ అయ్యే అన్ని చోట్లా సన్ స్క్రీన్ వాడాలి.

బ్లాక్ స్పాట్స్

ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఫేస్ మీద బ్లాక్ స్పాట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యకి కూడా ఇంట్లోనే ట్రీట్ చేసుకోవచ్చు. మజ్జిగ తీసుకుని అందులో ఒక కాటన్ బాల్ ముంచి ఆ బాల్ తో డార్క్ స్పాట్స్ మీద తుడవండి. పావుగంట అలాగే ఉంచి ఆ తరువాత కడిగేయండి. అలాగే, రెండు టీ స్పూన్ల ఓట్మీల్ తీసుకుని దానికి ఫుల్ ఫ్యాట్ మిల్క్ యాడ్ చేసి ఆ మిశ్రమాన్ని స్కిన్ మీద అప్లై చేయండి. కొన్ని నిమిషాల తరువాత కడిగేయండి.

చెమట కాయలు

ఈ సమస్య ఉన్నప్పుడు చెమట కాయలు ఉన్న ప్రదేశంలో నొప్పిగా ఉంటుంది, మండినట్లుగా ఉంటుంది. చెమట కాయల సమస్య ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో గాలి ఆడేలా చేసి చల్లని నీరు చల్లడం. కాసేపు అలాగే ఉంచేసి పౌడర్ చేయాలి. అలోవెరా జెల్ ని వాడొచ్చు. చాలామందికి చర్మం మీద డార్క్ ప్యాచెస్ వచ్చేస్తాయి. ఇలా వస్తే మీ బాత్ వాటర్ లో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మీ స్కిన్ ని ఈ నీటిలో సోక్ చేయండి. అలాగే, స్కిన్ కి లోపలి నుంచి కూడా హైడ్రేషన్ అందించాలి.. కాబట్టి బాగా నీరు తాగండి, ప్రత్యేకించి నిమ్మ కాయ నీరు. స్కిన్ మీద సోప్ యూజ్ చేయకండి, ఇది స్కిన్ ని ఇంకా డ్రై గా చేస్తుంది. కీర తురుముని అప్లై చేసినా కూడా ఫలితం ఉంటుంది.

ఈ టిప్స్ పాటించి మీ స్కిన్ ని జాగ్రత్తగా కాపాడుకోండి.

*చల్లని నీటితో స్నానం చేయండి.

*ఎక్స్ఫోలియేషన్ మరిచిపోకండి. హోమ్ మేడ్ స్క్రబ్స్ కూడా యూజ్ చేయవచ్చు.

*సమ్మర్ లో టోనర్స్ పోర్స్ కనపడకుండా చూస్తాయి. టోనర్ అప్లై చేస్తున్నప్పుడు మీ టీ జోన్ మీద శ్రద్ధ పెట్టండి.

*హెవీ మాయిశ్చరైజర్స్ బదులు లైట్ మాయిశ్చరైజర్స్ తీసుకోండి.

*సమ్మర్ లో శాండల్స్ వేసుకుంటారు కాబట్టి పెడిక్యూర్ కంపల్సరీ.

*మీరు తీసుకునే సీరమ్స్, మాయిశ్చరైజర్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉండేలా చూసుకోండి.

*ఇంత ఎండలో జిమ్ లో వర్కౌట్ చేయలేమనుకుంటే వాకింగ్ చేయండి, లేదా జుంబా ట్రై చేయండి. ఏం చేసినా సరే మీ ఎక్సర్‌సైజ్ మాత్రం స్కిప్ చేయకండి.

*విశ్రాంతి అవసరం, సమ్మర్ వేడిలో ఇంకా అవసరం. అందుకే, మీ షెడ్యూల్స్ ఎలా ఉన్న సరే, మీ రెస్టింగ్ టైమ్ మాత్రం మారకూడదు.

*ఎండలో బయటకి వెళ్ళవలసి వస్తే సన్ గ్లాసెస్ యూజ్ చేయండి.

*ఫేస్ మిస్ట్ మీకు ఎండ వేడిమి నుండి తక్షణం రిలీఫ్ ని ఇస్తుంది.

*తగినంత నీరు తాగండి. మీరు బయటకి వెళ్ళవలసి వస్తే మీతో పాటూ ఒక వాటర్ బాటిల్ నిండుగా నీరు తీసుకుని వెళ్ళండి.

*ఎంత తక్కువ మేకప్ యూజ్ చేయగలిగితే అంత మంచిది. మీకు ఫౌండేషన్ తప్పని సరి అయితే ఎస్‌పీఎఫ్ ఉన్న టింటెడ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయండి.

*మీ డైట్ లో తాజా పండ్లూ, కూరగాయలూ తీసుకోండి. ఈ సీజన్ లో లభిచే వాటిని తినడం ఎంతో మేలు చేస్తుంది.

స్కిన్ పీలింగ్- స్కిన్ థికెనింగ్

సన్ బర్న్ వల్ల స్కిన్ బాగా డ్యామేజ్ అయితే అది స్కిన్ పీలింగ్ కి దారి తీస్తుంది. చల్లని నీరు తీసుకుని అందులో ఒక కాటన్ బట్ట ముంచి దీన్ని కోల్డ్ కంప్రెస్ లాగా స్కిన్ మీద ఉంచండి. అలాగే, కోకోనట్ ఆయిల్ అప్లై చేయడం వల్ల స్కిన్ కి కావాల్సిన మాయిశ్చరైజేషన్ లభిస్తుంది. ఎంత వేడిగా ఉన్నా కూడా ఈ ఏరియాని రబ్ చేయడం కానీ, ఐస్ అప్లై చేయడం కానీ చేయకండి. అలాగే, పెరుగు అప్లై చేయడం కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది. స్ట్రాంగ్ యూవీ రేస్ స్కిన్ థికెనింగ్‌, స్కిన్ డ్రైనెస్‌కీ దారి తీస్తాయి. మీరు సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతే మీరు ఇప్పుడు మొదలు పెట్టాలి. కాసేపటి తరువాత ట్యాప్ వాటర్ తో కడిగేసి అద్దండి.

గమనిక: ఇవి కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించండి.
Show Full Article
Print Article
Next Story
More Stories