వేసవిలో దాహార్తిని తీర్చేదివే..

వేసవిలో దాహార్తిని తీర్చేదివే..
x
Highlights

రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండవేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పిల్లలు, ,ముదుసలి వాళ్ళు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి...

రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండవేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పిల్లలు, ,ముదుసలి వాళ్ళు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేడిమికి డీహైడ్రేషన్, విరేచనాలు, చమటకాయలతో బాదపడుతున్నారు. ఎండకు సరైనా జాగ్రత్తలు తీసుకోకుంటే తిప్పలు తప్పవంటున్నారు వైద్యనిపుణులు. అయితే వేసవిలో దాహార్తిని తీర్చే నీరు, కొబ్బరి నీళ్లతో పాటు మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

నీరు : మానవునితో పాటు అనేక జీవులకు జీవించడానికి అత్యంత అవసరమైన పదార్థం నీరు. సాధారణంగా రోజుకు 8 గ్లాసుల నీరు తాగాలి అది మామూలు రోజులు అయితే. అదే ఎండాకాలం అయితే మాత్రం మరో 6 గ్లాసులు అదనంగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండాకాలంలో శరీరానికి ఎక్కువగా చమట పోయడంతో శరీరంలోని నీరు బయటికి వస్తుంది. దాంతో శరీరానికి అవసరమైన నీరు అందుబాటులో ఉండదు. ఆ కారణంచేత బాడీ డీ హైడ్రేషన్ కు గురవుతుంది. తద్వారా ఎండాకాలం తగిన మోతాదులో నీటిని తీసుకోవడం అవసరం.

కొబ్బరి నీళ్లు : ఒంట్లో నీరసంగా ఉన్నా.. జ్వరం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగితే చాలు. కొబ్బరి నీళల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతికాలంలో మనకి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. పుష్కలమైన లవణాలు, పోషక విలువలు ఉండే కొబ్బరి నీళ్లు శరీరానికి చల్లదనం ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎండాకాలంలో ప్రతి ఒక్కరికీ దివ్యౌషధంలా పని చేస్తాయి. కొబ్బరి నీరు అలసట, వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

మజ్జిగ : అన్ని కాలాలలో శరీరానికి చక్కగా పనిచేసే ద్రవపదార్ధమే మజ్జిగ. ముఖ్యంగా ఎండాకాలంలో మజ్జిగ ఎక్కువగా తాగడం వలన బాడీ డీ హైడ్రేట్ అవ్వకుండా ఆహరం తిన్నంత శక్తీ వస్తుంది. ఈ మజ్జిగలో కొవ్వును తొలగిస్తారు కనుక పెద్ద వయసువారికి మంచి చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories