Summer Care: గుండె జబ్బులున్న వాళ్లు వేసవిలో ఈ తప్పులు అస్సలు చేయకండి!

Summer Care
x

Summer Care : గుండె జబ్బులున్న వాళ్లు వేసవిలో ఈ తప్పులు అస్సలు చేయకండి!

Highlights

Summer Care: చలికాలమే కాదు, వేసవిలో కూడా గుండె ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి.

Summer Care: చలికాలమే కాదు, వేసవిలో కూడా గుండె ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. చలిలో గుండె ఆగిపోయే ప్రమాదం ఎంత ఉంటుందో, వేసవిలో కూడా దాదాపు అంతే ప్రమాదం ఉంటుంది. అందుకే గుండె జబ్బులు ఉన్నవాళ్లు వేసవిలో తమ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వేసవిలో గుండెపై ఎక్కువ భారం పడకుండా చూసుకోవాలి. ఇంకా గుండె ఆరోగ్యం బాగా ఉండాలంటే ఏం చేయాలో నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువసేపు ఎండలో ఉండేవారు, బాగా కష్టపడి పనిచేసే వారికి వేసవిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. చిన్న చిన్న తప్పులు కూడా ఆసుపత్రి పాలు చేయవచ్చు. అందుకే చలికాలంలాగే వేసవిలో కూడా గుండె ఆరోగ్యం గురించి శ్రద్ధగా ఉండాలి. వేసవిలో ఆహారం, జీవనశైలిలో కొద్దిగా మార్పులు చేసుకుంటే మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. చలిలో గుండె రక్తనాళాలు ఎలా ప్రభావితమవుతాయో, వేసవిలో కూడా అలాగే ప్రభావితమవుతాయి. అయితే కారణాలు మాత్రం వేరుగా ఉంటాయి. అందుకే వేసవిలో కూడా గుండె ఆరోగ్యంపై నిఘా ఉంచాలి.

వేసవిలో గుండెకు ఇబ్బంది

సీనియర్ డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం.. వేసవిలో ఎక్కువసేపు ఎండలో ఉండటం గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. దాని వల్ల శరీరం వేడెక్కుతుంది. శరీరాన్ని చల్లగా ఉంచడానికి గుండె శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేయడానికి ఎక్కువసార్లు పంప్ చేయాల్సి వస్తుంది. దీని వల్ల గుండెపై భారం పెరుగుతుంది. అంతేకాకుండా మీరు ఎక్కువ పని చేస్తే ఎక్కువ చెమట పడుతుంది. దాని వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు కూడా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల గుండె జబ్బులు ఉన్నవారికి ఆంజినా (గుండె నొప్పి, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి శరీరం వేడెక్కకుండా చూసుకోవాలి.. ఎక్కువ వ్యాయామం లేదా పని చేయకూడదు.

గుండెను ఇలా కాపాడుకోండి

వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దాని కోసం ఎక్కువసేపు ఎండలో ఉండకూడదు. ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వేసవిలో చాలా తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఆహారంలో నీటి శాతం ఎక్కువగా ఉండాలి. కాలానుగుణంగా వచ్చే పండ్లు తినడం వల్ల కూడా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు.

మద్యం, పొగత్రాగడానికి దూరంగా ఉండండి

దీంతోపాటు మీరు మద్యం, పొగాకు అలవాటు ఉన్నవారైతే వాటిని నియంత్రించుకోండి. మద్యం, పొగాకు కూడా గుండె ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఒత్తిడికి దూరంగా ఉండండి. ఒకవేళ ఆందోళన లేదా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories