సమ్మర్ లో ఇవి తింటే మంచిది..

సమ్మర్ లో ఇవి తింటే మంచిది..
x
Highlights

బయట ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడిమి నుండి రక్షించుకోవడానికి, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు. వేసవి కాలంలో...

బయట ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడిమి నుండి రక్షించుకోవడానికి, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు. వేసవి కాలంలో శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం చాలా సాధారణం. సూర్యని తాపానికి, అధిక వేడితో శరీంలోని నీరంత చెమట రూపంలో బయట విసర్జించబడి శరీరం నీటిశాతాన్ని కోల్పోతుంది. కాబట్టి శరీరం వేసవి వేడి నుండి ఉపశమనం పొందాలి. వేసవికాలంలో చెమట వల్ల ఒంట్లో నీటిని కోల్పోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురికావల్సి ఉంటుంది. సమ్మర్ వెజిటేబుల్స్ డీహైడ్రేషన్ ను నివారిస్తాయి, మనిషిని ఎనర్జిటిక్ గా ఉంచడంతో పాటు వీటిలో విటమిన్స్ అధికంగా ఉంటాయి.. అలాగే వేసవిలో రెగ్యులర్ డైట్ లో కూడా మార్పులు చేసుకోవాలి.. వేడి చేసే ఆహార పదార్ధాలు, చికెన్, మటన్, బిర్యానీ లాంటివి తినడం తగ్గించాలి.

సమ్మర్ సీజన్ లో మన శరీరం వేసవి తాపానికి తట్టుకొనే విధంగా ఆహారాన్ని తీసుకొన్నట్లైతే కావల్సినంత శక్తిని అందించడంతో పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒక్క వేసవిలో మాత్రమే దొరికే ఈ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. సమ్మర్ హెల్తీ ఫ్రూట్ మామిడిపండు.. మామిడిలో ఐరన్ మరియు సెలీనియమ్ పుష్కలంగా ఉంది. అలాని మామిడిపండ్లను ఎక్కువగా తీసుకోకూడదు.. , పుచ్చకాయ : ఇందులో అధికంగా నీరు ఉంటుంది. వేసవిలో ఈ పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. , ఆరెంజ్: ఈ సిట్రస్ పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. చెమట ద్వారా కోల్పోయిన పొటాషియంను ఆరెంజ్ ను తినడం వల్ల ఫుల్ ఫిల్ చేస్తుంది. ఇక అరటి, బొప్పాయి,జామకాయ, కివి పండ్లు , చెర్రీస్, నిమ్మ, స్ట్రాబెరి, కర్బూజ, కొబ్బరి బొండాం లాంటివి వేసవి తాపం నుంచి తట్టుకోవడానికి ఉపయోగపడతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories