Summer Diet: ఎండవేళ పరగడుపున ఇవి తింటే.. బలహీనతకు స్వస్తి చెప్పొచ్చు..!

Summer Diet for Instant Energy and Strong Immunity Soaked Chana Benefits for Health
x

Summer Diet: ఎండవేళ పరగడుపున ఇవి తింటే.. బలహీనతకు స్వస్తి చెప్పొచ్చు..!

Highlights

Summer Diet Plan: ఎండాకాలం వచ్చింది.. ఈ నేపథ్యంలో ఇమ్యూనిటీ కూడా బలహీనంగా మారిపోతుంది. డీహైడ్రేషన్ కూడా గురవుతారు.. అయితే ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం కొన్ని పదార్థాలు డైట్లో ఉంటే మంచిది.

Summer Diet Plan: వేసవికాలంలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు డైట్లో చేర్చుకోవాలి. తద్వారా బలహీనతకు గురికాకుండా ఉంటారు. కొన్ని రకాల ఫుడ్స్ మన డైట్ లో ఉంటే ఎల్లవేళలా మనకు శక్తి అందిస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి తెలుసుకుందాం.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నానబెట్టిన శనగలు వంటివి తీసుకోవటం వల్ల శరీరానికి మంచిది. ఎందుకంటే ఇందులో ఫైబర్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. తద్వారా రోజంతటికి కావాల్సిన శక్తి అందిస్తుంది. ఇందులో విటమిన్ సి, ప్రోటీన్ ఉండటం వల్ల తక్షణ శక్తిని ఇస్తుంది.

ప్రధానంగా ఈ పప్పులలో శనగలు, పెసరపప్పు నానబెట్టి రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల విటమిన్ బీ6, కోలిన్‌ కూడా అందుతుంది. ఇది మెదడుకు మేలు చేస్తాయి. డయాబెటిస్ రోగులకు కూడా మంచివి. మెదడు అభిజ్ఞా పనితీరు కూడా మేలు చేస్తాయి. ఎండవేళ ఈ నానబెట్టిన శనగలు, పెసర్లు ఉదయం పరగడుపున తీసుకుంటే మంచిది. మొలకెత్తినవి తీసుకోవడం వల్ల మరిన్ని లాభాలు పొందుతారు. ఎండాకాలం కడుపు సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి. ఈ నేపథ్యంలో ఉదయం ఈ ఉడకబెట్టిన సలాడ్ తీసుకున్నా మంచిది.. నానబెట్టి ఉదయం పూట తీసుకున్నడం వల్ల రోజంతట కావాల్సిన ఎనర్జీ అందిస్తాయి.

ఇవి నానబెట్టి తినడం వల్ల దీర్ఘకాలిక మలబద్ధక సమస్యతో పాటు కడుపులో అజీర్తి, గ్యాస్ కూడా తగ్గిపోతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. అయితే నానబెట్టిన శనగలు ఆరోగ్యానికి మాత్రమే కాదు.. జుట్టుకు కూడా మంచిది. నానబెట్టిన శనగలు తీసుకోవడం వల్ల మీ జుట్టు కూడా కాంతివంతంగా సహజంగా పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories