Health Tips : తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? అయితే మీ ప్రాణాలకే ప్రమాదం..ఈ పొరపాటు అస్సలు చేయకండి!

Health Tips
x

Health Tips : తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? అయితే మీ ప్రాణాలకే ప్రమాదం..ఈ పొరపాటు అస్సలు చేయకండి!

Highlights

Health Tips : సాధారణంగా మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి మన కడుపులో కొన్ని రకాల జీర్ణరసాలు, యాసిడ్లు ఉత్పత్తి అవుతాయి.

Health Tips : సాధారణంగా మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి మన కడుపులో కొన్ని రకాల జీర్ణరసాలు, యాసిడ్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అయితే, భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం వల్ల ఈ జీర్ణరసాలు పలుచబడిపోతాయి. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది కాలక్రమేణా అనేక దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది.

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి కనీసం రెండు గంటల సమయం పడుతుంది. కాబట్టి భోజనం చేసిన తర్వాత కనీసం 45 నుంచి 60 నిమిషాల వరకు నీరు తాగకూడదు. ఒకవేళ మీకు నీళ్లు తాగాలి అనిపిస్తే, భోజనానికి అరగంట ముందే తాగడం మంచిది. దీనివల్ల మీ శరీరం ఆహారంలోని పోషకాలను చక్కగా గ్రహించగలుగుతుంది.

తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కలిగే నష్టాలు:

జీర్ణక్రియ సమస్యలు: తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కడుపులో గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల కడుపునొప్పి కూడా రావచ్చు.

బరువు పెరగడం: ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు, అది కొవ్వుగా మారి శరీరంలో పేరుకుపోతుంది. ఇది మీ మెటబాలిజం రేటును తగ్గిస్తుంది, తద్వారా మీరు త్వరగా బరువు పెరుగుతారు. ముఖ్యంగా పొట్ట పెరగడానికి ఈ అలవాటే ప్రధాన కారణం.

హోట్టె భారం: నీటి వల్ల కడుపులోని వేడి తగ్గిపోతుంది, దీనివల్ల ఆహారం కడుపులో ఎక్కువ సేపు ఉండిపోయి, భారంగా అనిపిస్తుంది.

పోషకాహార లోపం: మనం తినే ఆహారంలో ఉండే విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలను శరీరం పూర్తిగా గ్రహించలేదు. దీనివల్ల భవిష్యత్తులో పోషకాహార లోపం ఏర్పడే అవకాశం ఉంది.

సరైన సమయంలో నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

భోజనం చేసిన గంట తర్వాత నీరు తాగడం అలవాటు చేసుకుంటే మీ శరీరంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. దీనివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. అనవసరమైన కొవ్వు చేరదు. జీర్ణక్రియ బలంగా మారుతుంది. దీనివల్ల కడుపు ఎప్పుడూ తేలికగా ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు శాశ్వతంగా దూరమవుతాయి. అలాగే ఆహారంలోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయి. ఇది మీ నిద్ర నాణ్యతను పెంచడమే కాకుండా, రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories