
ఈ రోజుల్లో చాలా చిన్న వయసు ఉన్న వారిలో ఏదో ఒక రకమైన జీర్ణసమస్య కనపడుతుండటం చూస్తున్నాం. తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపించడం, పొట్ట రాయిలా మారడం,...
ఈ రోజుల్లో చాలా చిన్న వయసు ఉన్న వారిలో ఏదో ఒక రకమైన జీర్ణసమస్య కనపడుతుండటం చూస్తున్నాం. తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపించడం, పొట్ట రాయిలా మారడం, పుల్లని తేన్పులు రావడం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రతి ఇంట్లోనూ తమకు మలబద్దకం గ్యాస్, గుండెల్లో మంటగా ఉంటోందనో చెప్పడం చాలా సాధారణం. మారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క కుటుంబానికీ ఉపకరించేలా ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియలోనూ, జీర్ణ సమస్యలో ఎదుర్కొనే సాధారణ సమస్యలూ, వాటి పరిష్కారాల గురించి తెలుసుకుందాం...
కడుపులో గ్యాస్ సమస్యకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఇవి కొన్ని... ∙కడుపులో కొద్దిపాటి ఖాళీ కూడా మిగల్చకుండా తినడం ∙తిన్నవెంటనే పడుకోవడం ∙ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉండటం. ∙ఉప్పు, కారం, మసాలాలు అధికంగా ఉండటం. ∙మనం తీసుకున్న ఆహారంలో తగినన్ని పీచుపదార్థాలు ఉండకపోతే... అలాంటప్పుడు యాసిడ్ పనిచేసే సమయంలో కడుపు కండరాలకు తగినంత రక్షణ దొరకదు. యాసిడ్ నేరుగా కడుపు కండరాలపై పనిచేస్తుండటంతో కడుపులో మంట, గ్యాస్ పైకి ఎగజిమ్మడం వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే పలు సూచనాలు పాటించాలి. ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని మూడు పూటల్లో కాకుండా చిన్న చిన్న మోతాదుల్లో తినాలి. అలాగే ఊబకాయం ఉన్నవారు బరువు తగ్గించుకోవాలి ప్రయత్నం చేయాలి. పొగతాగడం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు వాటిని మానివేయాలి.రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందర రెండుగంటల పాటు ఏమీ తినకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పోందవచ్చు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



